‘పూసింది పూసింది పున్నాగ పూసంత నవ్వింది నీలాగా’ అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అయిన సంగీత కెరటం ఎం.ఎం కీరవాణి. అక్కడి నుంచి వేణు తిరిగి చూసుకోకుండా తెలుగు ప్రేక్షకులకు ఎన్నో అధ్బుతమైన, భావ ప్రదమైన పాటలను అందించి టాలీవుడ్ లో అగ్ర మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందారు. అలాంటి లేజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందించిన చిన్న సినిమా ‘దిక్కులు చూడకు రామయ్య’. ఇటీవలే విడుదలైన ఈ పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ అవుతున్న సందర్భంగా కీరవాణితో కాసేపు ముచ్చటించాం.. ఆయన చెప్పిన విశేషాలు మీ కోసం…
ప్రశ్న) వారాహి చలన చిత్రం బ్యానర్ లో మీకిది రెండవ సినిమా ఇది. సాయి కొర్రపాటితో పనిచేయడం ఎలా ఉంది.?
స) నాకు సాయి కొర్రపాటితో మంచి సాన్నిహిత్యం ఉంది. తన తో పనిచేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. మ్యూజిక్ కంపోజిషన్ విషయంలో నాకు చాలా ఫ్రీడం ఇస్తాడు, అలాగే నేను ఏమన్నా సలహాలు ఇచ్చినా స్వీకరిస్తాడు.
ప్రశ్న) ‘దిక్కులు చూడకు రామయ్య’ గురించిన విశేషాలు చెప్పండి.?
స) ఇది చాలా ఫ్రెష్ స్టొరీ.. తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే అమ్మాయితో ప్రేమలో పడే కథ. సినిమాని చాలా నీట్ గా మరియు ఎంతో క్లారిటీతో తీసారు. ముఖ్యంగా అజయ్ ఈ సినిమాలో తన కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అజయ్ నటనే ఈ సినిమాకి మేజర్ హైలైట్. ‘ఈగ’ సినిమాలో సుధీప్ కి వచ్చినంత గుర్తింపు ఈ సినిమాతో అజయ్ కి వస్తుంది.
ప్రశ్న) తొలి చిత్ర దర్శకుడైన త్రికోటితో పనిచేయడం ఎలా ఉంది.?
స) నాకు త్రికోటి ఎస్ఎస్ రాజమౌళి దగ్గర అసోషియేట్ గా చేస్తున్నప్పటి నుంచి, అనగా 10 సంవత్సరాల నుంచి తెలుసు. నాకు తనతో పనిచేయడం చాలా కంఫర్టబుల్. చాలా టాలెంట్ ఉన్న డైరెక్టర్ అది మీకు ఈ సినిమాతో ప్రూవ్ అవుతుంది.
ప్రశ్న) మీ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా మ్యూజిక్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకలా.? మీ నాన్నగారి పాట ఇందులో వాడటానికి ఏమన్నా ప్రత్యేక కారణం ఉందా.?
స) ఈ ఆల్బంలో ఎలాంటి రెగ్యులర్ ప్రేమ గీతాలు లేవు అందుకే కాస్త కొత్తగా ఉంటాయి. అన్నీ సందర్భానుసారంగా వచ్చే పాటలే ఉంటాయి. నిజం చెప్పాలంటే స్టొరీ లైన్ నన్ను మ్యూజిక్ చెయ్యడానికి బాగా ఇన్స్పైర్ చేసింది. మా నాన్నగారు రాజన్నకి కూడా సాంగ్స్ రాశారు. ఏదో ఒక చిన్న సెంటిమెంట్ లాగా ఈ సినిమాకి రాశారు.
ప్రశ్న) ఈ మధ్య మీరు బయట వారితో కంటే ఎక్కువగా రాఘవేంద్ర రావు, రాజమౌళి సినిమాలకే మ్యూజిక్ చేస్తున్నారు. అలాగే ఎందుకు లిమిటెడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు.?
స) దీని వెనుక ఎలాంటి ప్రత్యేక కారణం లేదు. మిగతా వారు నన్ను అప్రోచ్ అవ్వడం లేదు అందుకే లిమిటెడ్ సినిమాలు చేస్తున్నాను. అలా అని నేను ఏదో కొంతమందికే మ్యూజిక్ చేస్తానని కాదు. కానీ వాళ్ళు నా దగ్గ నుంచి బెస్ట్ అవుట్ పుట్ రాబట్టుకుంటారు. నన్ను అప్రోచ్ అయిన వారితో వర్క్ చెయ్యడానికి నేను ఎప్పుడూ సిద్దమే..
ప్రశ్న) మీ ప్రకారం ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారు.?
స) ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. నేను మాత్రం ‘స్వామి రారా’ ఫేం ఎంఆర్ వర్మ మ్యూజిక్ కి బాగా ఇంప్రెస్ అయ్యాను.
ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?
స) ప్రస్తుతం తెలుగులో ‘బాహుబలి’ సినిమా చేస్తున్నాను. ఇది కాకుండా బాలీవుడ్ లో ‘బేబీ’ మరియు ‘టిట్లి’ అనే సినిమాలు చేస్తున్నాను.
అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి, కీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా ఆడియో లానే మంచి విజయం సాధించాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము.
CLICK HERE FOR ENGLISH INTERVIEW


