ఇంటర్వ్యూ : నాగ చైతన్య – అఖిల్ ఎంట్రీ మూవీని మరో లెవల్ కి తీసుకెళ్ళింది.

ఇంటర్వ్యూ : నాగ చైతన్య – అఖిల్ ఎంట్రీ మూవీని మరో లెవల్ కి తీసుకెళ్ళింది.

Published on May 27, 2014 1:54 PM IST

Naga-Chaitanyaఅక్కినేని వారసుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన నాగ చైతన్య లవ్ ఎంటర్టైనర్ సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. తాజాగా నాగ చైతన్య ఎఎన్ఆర్, నాగార్జునలతో కలిసి నటించిన ‘మనం’ సినిమా విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని మరియు సినిమా విశేషాలను పంచుకోవడానికి మాతో కాసేపు ముచ్చటించారు. మరి నాగ చైతన్య మాతో పంచుకున్న విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ముందుగా మనం ఇంట పెద్ద సక్సెస్ అయినందుకు శుభాకాంక్షలు.. మీరు ‘మనం’ విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?

స) ‘మనం’ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సినిమాని ఇంత పెద్ద విజయం చేస్తున్న ప్రతి ఒక్కరికీ నా థాంక్స్. వాళ్ళందరూ ఎఎన్ఆర్ కి ‘మనం’ ఒక మరపురాని జ్ఞాపకంగా చేస్తున్నారు.

ప్రశ్న) రాధా మోహన్ పాత్ర కోసం ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకున్నారా?

స) నాకు విక్రమ్ నా పాత్ర గురించి చెప్పినప్పుడు నేను చాలా క్రేజీగా ఫీలయ్యాను. నాగార్జున గారికి నాన్నగా కనిపించాలనగానే నేను కాస్త తడపడ్డాను. కానీ విక్రమ్ నా పాత్ర గురించి పూర్తి క్లారిటీ ఇవ్వడమే కాకుండా ఆ పాత్ర చేయగల ధైర్యాన్ని ఇచ్చాడు.

ప్రశ్న) ఒకేసారి ఎఎన్ఆర్, నాగార్జునతో కలిసి నటించడం ఎలా ఉంది? ఆ ఆనుభవం గురించి చెప్పండి?

స) మొదట్లో వారిద్దరితో సీన్స్ చేయాలన్నప్పుడు తడబడ్డాను. దాన్ని ఎలా బ్రేక్ చెయ్యాలా అనుకుంటూనే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశాను. నాకు వాళ్ళిద్దరూ రోల్ మోడల్స్.. అలాంటిది వారితో నేను చాలా కేర్ లెస్ సీన్స్ చెయ్యాలి, అలాగే మందు కొట్టే సీన్స్ చెయ్యాలి. మొదట్లో బాగా కష్టం అనిపించినా తర్వాత బెటర్ అయ్యాను. వారిద్దరితో పనిచేయడం ఎప్పటికీ మరచిపోలేని అనుభవం.

ప్రశ్న) విక్రమ్ కుమార్ తో పనిచేయడం ఎలా ఉంది?

స) నాకు ఇన్ని ప్రశంశలు వస్తున్నాయంటే దానికి కారణ విక్రమ్ కుమార్. అతనే నాకు పూర్తి ధైర్యాన్ని ఇచ్చి నాకు ఓన్ స్టైల్ లో నా పాత్రని చేయమన్నారు. నేను అతను చెప్పింది బాగా ఫాలో అయ్యాను. దానివల్ల వచ్చిన రిజల్ట్స్ మీరే చూస్తున్నారు..

ప్రశ్న) మరోసారి సమంతతో కలిసి చేసారు. దీనిపై మీ కామెంట్..

స) మేమిద్దరం ఒకేసారి మా కెరీర్ ని స్టార్ట్ చేసాం. అలాగే మా కాంబినేషన్ లో 3 సినిమాలు చేసాం. మేము కలిసి పని చేసిన ప్రతి సారి మా ఇద్దరి కెమిస్ట్రీ బెటర్ గా ఉంటుంది.

ప్రశ్న) ఈ సినిమాలో మీరు రెండు విభిన్న పాత్రలు చేసారు. అందులో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది?

స) కచ్చితంగా కాలేజ్ స్టూడెంట్ గా చేసిన నాగార్జున పాత్రంటేనే నాకు ఇష్టం. నేను ఆ పాత్రకి బాగా కనెక్ట్ అయ్యాను. అలాగే నాకు ఆ పాత్ర చేయడం చాలా ఈజీగా అనిపించింది.

ప్రశ్న) మీ యాక్టింగ్ స్కిల్స్ ఈ సినిమాతో చాలా మెరుగయ్యాయి. దానికోసం ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకున్నారా.?

స) నా అనుభవమే దానికి కారణం.. నేను వరుసగా ఒకదాని తర్వాత ఒక సినిమా చేస్తున్నాను. నా కాన్ఫిడెన్స్ లెవల్స్ తో పాటు కెమెరా ముందు ఇంకా ఎనర్జీగా పెర్ఫార్మన్స్ చేసే దానిలో కూడా మెరుగుపడుతున్నాను.

ప్రశ్న) అనూప్ రూబెన్స్ మ్యూజిక్ గురించి మీ మాటల్లో..

స) ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కూడా ఒక కారణం. ఈ సినిమాకి తను చాలా మెలోడియస్ సాంగ్స్ అందించాడు. ముఖ్యంగా అనూప్ అందించిన రీ రికార్డింగ్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళింది.

ప్రశ్న) అఖిల్ స్టన్నింగ్ ఎంట్రీ గురించి మీరేమి చెబుతారు.?

స) అఖిల్ ఎంట్రీ సూపర్బ్ అని చెప్పాలి, అలాగే తన ఎంట్రీ క్లైమాక్స్ ని మరో లెవల్ కి తీసుకెళ్ళింది. అఖిల్ కి ఇంతకన్నా బెటర్ లాంచింగ్ చాన్స్ రాదని కూడా నేను అఖిల్ కి చెప్పాను. కానీ ఇది పూర్తిగా డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఐడియా. కానీ అఖిల్ ఎంట్రీ మాత్రం అందరినీ మరో స్థాయికి తీసుకెళ్ళింది.

ప్రశ్న) ఆటోనగర్ సూర్య ఎప్పుడు రిలీజ్ అవుతుంది?

స) నిజంగా చెప్పాలంటే రిలీజ్ గురించి చప్పడానికి నాకు పెద్దగా తెలియదు. నేను కూడా ఈ సినిమా త్వరగా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేసారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది.

ప్రశ్న) మీ తదుపరి సినిమా ఒక లైలా కోసం సినిమా ప్రొడక్షన్ పనులు కూడా మీరే చూసుకుంటున్నారు. అది మీ నిర్ణయమేనా.?

స) చెప్పాలంటే ఇది నాన్న(నాగార్జున) ప్లాన్.. ప్రొడక్షన్ లో కూడా అకొన్ని నేర్చుకోవాలని అన్నారు. నేను కూడా భవిష్యత్తులో సినిమాలు నిర్మించడానికి ఇష్టపడుతున్నాను. అవి అన్నీ మా సొంత బ్యానర్ లోనే ఉంటాయి.

అంతటితో నాగ చైతన్య తదుపరి ప్రాజెక్ట్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు