ఇంటర్వ్యూ : “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” నిర్మాత ఎస్వి బాబు – ఆడియెన్స్ ను మోసం చెయ్యం

ఇంటర్వ్యూ : “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” నిర్మాత ఎస్వి బాబు – ఆడియెన్స్ ను మోసం చెయ్యం

Published on Jan 20, 2021 6:05 PM IST

“నీలి నీలి ఆకాశం” అంటూ టాలీవుడ్ టాప్ యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు హీరోగా అమృత అయ్యర్ లు చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. దానితోనే వారు చేసిన “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” సినిమాకు ఎనలేని క్రేజ్ వచ్చి మంచి హైప్ నెలకొంది. మరి థియేట్రికల్ విడుదలకే రెడీ అవుతున్న ఈ సినిమా నిర్మాత ఎస్వీ బాబు లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. మరి అవేంటో పరిశీలిద్దాం..

మీ సినిమా సాంగ్ రికార్డ్ హిట్ అవుతుందని మీరు అనుకున్నారా..సినిమా కోసం ఏమన్నా?

ముందుగా మీడియా మిత్రులు అందరికి చాలా ధన్యవాదాలు అండి, ఇక పోతే మా సాంగ్ ఇంత పెద్ద హిట్ అవుతుంది అని అసలు అనుకోలేదు, ఒక్క మన దగ్గరే కాదండి మొత్తం సౌత్ ఇండియాలో కూడా పెద్ద హిట్టయ్యింది.ఇంత పెద్ద హిట్ అవుతుంది అని అయితే అనుకోలేదు. ఎంతలా అంటే కన్నడలో నేను ఈ సినిమా చేసానని తెలియని వాళ్ళు నాకే చూపించి ఇలాంటిది ఇక్కడ కూడా ప్లాన్ చెయ్యాలని అడిగేవారు అప్పుడు అందులో ఆ సినిమా మాదే అని పేరు చూపిస్తే అప్పుడు తెలుసుకున్నారు. అలాగే ఈ సాంగ్ వల్లే కాకుండా సినిమా కూడా చాలా బాగుంటుంది. ఎవరు కూడా మా డైరెక్టర్ కి ఇది మొదటి సినిమా అనుకోరు ఒక బేబీ లా ఈ సినిమాను తీశారు.

మరి లాక్ డౌన్ కన్నా ముందే రెడీగా ఉన్న సినిమా ఓటిటికి ఎందుకు ఇవ్వలేదు?

ఆఫర్స్ వచ్చిన మాట నిజమే కానీ మేము ఈ సినిమాకు ఖచ్చితంగా థియేటర్ లోనే విడుదల చెయ్యాలని ఫిక్స్ అయ్యాం. ప్రదీప్ కు ఇది ఫస్ట్ సినిమా అలాగే భగవంతుడు కూడా నేను ఇప్పటి వరకు చేసిన ఏ సినిమాకు కూడా అన్యాయం చెయ్యలేదు. అందుకే నేను కూడా థియేటర్స్ లోనే రిలీజ్ చెయ్యాలని అందరికీ చెప్పాను. అలాగే మా దర్శకుడు హీరో కూడా డబ్బులు వచ్చేయాలి అని ఈజీగా అనుకున్నా నాకు నా ప్రోడక్ట్ పై ప్రఘాడ నమ్మకం ఉంది.

చాలా సినిమాలు సాంగ్స్ వల్లే ఎక్కువ ఫేమ్ తెచ్చుకున్నాయి దీనికీ అలానే అయ్యింది మరి ఈ సినిమా అంచనాలు రీచ్ అవుతుందా.?

ఖచ్చితంగా ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుంది. ఇప్పటి వరకు సాంగ్స్ పెద్ద హిట్టయ్యి సినిమా ఫెయిల్ అయ్యినవి చాలా ఉన్నాయి. దీనిపైనే మా టీం అంతా కూడా కలిసి కూర్చొని అన్ని యాంగిల్స్ లో చాలా చర్చ చేసి కరెక్షన్స్ చేసి నిర్మాత అల్లు అరవింద్ గారికి బన్నీ వాస్ గారికి చూపించాం వారికి నచ్చే తమ బ్యానర్ లో విడుదల చేస్తున్నారు. మరి ఫైనల్ గా మా సినిమాకు వచ్చిన ప్రేక్షకులను ఎక్కడా నిరాశ పరచం మోసం చెయ్యం, ఎక్కడా బోర్ కొట్టదు ఇవన్నీ ఆలోచించే ఫిక్స్ అయ్యాం. అందుకే “పాటంత బాగుంటుంది సినిమా” అనే కాప్షన్ పెట్టాం.

ఇది లవ్ స్టోరీ అని కొత్తగా చెప్పక్కర్లేదు మరి ఇందులో వేరే కొత్తగా ఏముంది?

నేను సౌత్ అన్ని భాషల్లో సినిమాలు చేశాను నాకు తెలుసు మరి ఏ సినిమా విషయంలో అయినా సరే ఒక్క ఫ్రేమ్ తోనే మొదలవుతుంది. అలా మా సినిమాలో కూడా ఒక ఫ్రేమ్ తో మొదలయ్యి అది ఎక్కడి వరకు తీసుకెళ్లింది అన్నదే అసలు కథ. ఇందులో మళ్ళీ రెండు షేడ్స్ పెట్టాం. దర్శకుడు మున్నా చాలా క్వాలిటీ ప్రోడక్ట్ మాకు అందించారు. ఇప్పటి వరకు చాలా పెద్దలు సినిమా చూసి మెచ్చుకున్నారు. మరి రియల్ ఆడియెన్స్ ఏం చెప్తారో ఈ 29 మార్నింగ్ తెలిసిపోతుంది.

ఇప్పుడు నిర్మాతగా మీకు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ వచ్చింది మీకు?

సినిమా ఎలా చెయ్యాలి, ప్రజలను ఎలా మెప్పించాలి, ఎలా విడుదల చెయ్యాలి అన్నవి నేర్చుకున్నా అలాగే సినిమా తియ్యడం అనేది 25 శాతం అయితే దాన్ని విడుదల చెయ్యడం అనేది 75 శాతం ఉంటుంది. ఆ 75 శాతం కలిసి రాకపోతే ఎంత మంచి సినిమా తీసినా ఎంత పెద్ద హీరోతో తీసినా ప్రజలు తీసుకోరు.

దర్శకుడు మున్నా, ప్రదీప్ హీరోగా ఇద్దరికీ డెబ్యూ సినిమా ఎలా ఓకే అయ్యింది?

డైరెక్టర్ మున్నా నాకు భద్రం గారి ద్వారా పరిచయం. భద్రం నాకు బాగా తెలుసు అప్పుడప్పుడు కొత్త వాళ్ళతో సినిమా చెయ్యాలి అని చెప్పాను అలా అతను మున్నా కోసం చెప్పాడు. నేను ఎప్పుడు మొదటగా కథ వినను లాస్ట్ లోనే వింటా ముందు మా అబ్బాయి ఇంకా కొంతమంది విన్నారు వాళ్ళు విన్నాక నేను పడుకుంటే వచ్చి లేపి మరీ ఈ మంచి సబ్జెక్టును లాక్ చేసుకోమని చెప్పారు. అలా ఫైనల్ చేశాను.

డైరక్టర్ గారే సినిమా హీరో, హీరోయిన్ ను లాక్ చేసారా.?

లేదండి అదంతా టీం వర్క్ మాత్రమే, హీరోయిన్ కు అయితే చాలా మందినే వెతికాము కానీ చాలా మంది ఫోటోలు వచ్చాయి. అప్పుడు ఈ హీరోయిన్ ఫోటో వచ్చింది ఆమెతో బెంగళూర్ లో కూడా ఓసారి మాట్లాడాను అప్పుడు మా టీం కు ఆమె డీటెయిల్స్ పంపి ఫైనల్ చేసాము.

లాక్ డౌన్ లో ఎవరికీ ఏమీ లేదు నిర్మాతగా మీరెలా ఫీలయ్యారు?

నేను చాలా హ్యాపీ ఫీలవుతున్నాను. ఎందుకంటే ఈ సమయంలోనే మా సాంగ్ 300 మిలియన్ వరకు వెళ్ళింది. అప్పటికే 250 మిలియన్ ఉన్న సాంగ్ మరింత మందికి చేరింది. ఆ టైం లో నేను బెంగళూర్ లో ఉన్నాను అక్కడి పోలీసులు చాలా కష్టపడ్డారు. అందుకే వారి కోసం కూడా ఒక వీడియో సాంగ్ చెయ్యగా దానికి అక్కడ చాలా గుర్తింపు వచ్చింది. అలాగే అక్కడి పోలీసు వాళ్లకి నా కార్ లో బటర్ మిల్క్, స్నాక్స్, బిస్కట్స్ పంపేవాడిని అక్కడ కూడా ఆ సాంగ్ వినడం ఆనందం ఉండేది.

అంత మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్ గారి కోసం చెప్పండి.

నిజంగా అనూప్ గారికి హ్యాట్సాఫ్ అండి, అయనకి నేను ప్రామిస్ చేశాను కన్నడలో నెక్స్ట్ సినిమా ఇస్తానని మా డైరెక్టర్ తో ఇప్పుడు వాళ్లిద్దరూ ఆలుమగలు అయ్యిపోయారు. ప్రదీప్ కూడా అనూప్ ను చాలా అభిమానిస్తాడు.

ఈ 29 విడుదల ఏంటి టైటిల్ లో ఏమో 30 ఉంది.?

దీనికో మ్యాజిక్ ఉందండి మేము మా సాంగ్ కరెక్ట్ గా జనవరి 30 న విడుదల చేసాం ఇప్పుడు ఫైనల్ గా సినిమా 29న విడుదల అవుతుంది అంటే కరెక్ట్ గా 365 రోజులు ఏడాది అయ్యిపోయింది. దీనినే ప్రదీప్ గారు కూడా ఓ సీక్రెట్ చెప్తా అని చెప్పారు. నేను మామూలుగా ఏ సినిమాకు అయినా ఒక వారం రోజుల ముందే ప్రీ ప్లాన్డ్ గా ఉంటాను కానీ ఈ సినిమాకు మాత్రం దానికి నచ్చినట్టే అయ్యింది. మొదటగా ఫిబ్రవరి 5న విడుదల అనుకున్నాం కానీ ఫైనల్ గా 29కి ఫిక్స్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు