ఇంటర్వ్యూ : మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ – “డెవిల్” కి ఈ రేంజ్ లో ప్రశంసలు వస్తాయనుకోలేదు

ఇంటర్వ్యూ : మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ – “డెవిల్” కి ఈ రేంజ్ లో ప్రశంసలు వస్తాయనుకోలేదు

Published on Dec 24, 2023 1:37 PM IST

నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రం “డెవిల్”. కోసం అందరికీ తెలిసిందే. ఓ థ్రిల్లింగ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్స్ గా నటించాడు. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది.ఈ ప్రమోషన్స్ లో భాగంగా టాలెంటెడ్ మ్యూజిక్ దర్శకుడు హర్ష వర్ధన్ రామేశ్వర్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది మరి తాను ఎలాంటి విషయాలు పంచుకున్నాడో చూద్దాం రండి.

 

డెవిల్ మ్యూజిక్ కి వచ్చిన స్పందన చూసి ఎలా అనిపించింది?

డెవిల్ సినిమా విషయంలో సంగీతం, నేపథ్య సంగీతానికి ఈ స్థాయిలో స్పందన వస్తుందని అనుకోలేదు. అందరికీ నచ్చుతుందని అనుకున్నాం. కానీ ఈ రేంజ్‌లో ప్రశంసలు వస్తాయని అనుకోలేదు. అందరూ ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు.

 

బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఇప్పుడు మీకో మార్క్ ఉంది. డెవిల్ కి మీ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది?

అర్జున్ రెడ్డి తరువాత నన్ను బ్యాక్ గ్రౌండ్ స్పెషలిస్ట్ చేశారు. కానీ నాకు పాటలకు సంగీతం ఇవ్వడమే తెలుసు. అదే నాకు చాలా ఇష్టం. నాకు ఇప్పుడు ఆర్ఆర్, మ్యూజిక్ ఇలా అన్నింట్లో ఆఫర్లు వస్తున్నాయి. డెవిల్ వరకు చాలా విదేశీ సంప్రదాయ వాయిద్యాలు వాడాం. న్యాచురల్‌గా ఉండాలనే అలా ప్రయత్నించాం. ఇప్పుడు అది అందరికీ నచ్చేసింది. 1940 నేపథ్యం కాబట్టి బాగానే రీసెర్చ్ చేయాల్సి వచ్చింది.

 

హీరో కళ్యాణ్ రామ్, నటి సంయుక్త కోసం చెప్పండి

డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ గారి నట విశ్వరూపాన్ని చూస్తారు. బింబిసారను మించేలా ఉంటుంది. సంయుక్త మీనన్ అద్భుతంగా నటించారు.

 

మీ ప్రొడ్యూసర్ కోసం చెప్పండి

అభిషేక్ నామా గారు నన్ను చాలా నమ్మారు. కాస్త లేట్ అయినా పర్లేదు నాకోసం వాళ్లు వెయిట్ చేశారు. ఆయన తలుచుకుంటే ఎవరితోనైనా మ్యూజిక్ చేయించుకునేవారు. కానీ ఆయన నా మీదున్న నమ్మకంతో ఆగారు. నాకు చాలా సపోర్టివ్‌గా నిలిచారు. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో అవార్డులు కూడా వస్తాయేమో.

 

సినిమాలో విజువల్స్ గ్రాండ్ గా ఉన్నట్టు ఉన్నాయి, మీ సినిమాటోగ్రాఫర్ కోసం చెప్పండి

డెవిల్ చిత్రానికి కెమెరామెన్ సౌందర రాజన్ ప్రాణం పెట్టారు. అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. వాటికి తగ్గట్టుగానే ఆర్ఆర్ ఉంటుంది. మేం ఎంత చేసినా విజువల్స్ లేకపోతే ఆ ప్రభావం కనిపించదు.

 

ఈ సినిమాకి నిర్మాతే డైరెక్టర్ గా కూడా వర్క్ చేశారు అయన డైరెక్షన్ కోసం చెప్పండి

డెవిల్ లైన్‌ను అభిషేక్ నామా గారే చెప్పారు. ముందు నుంచి ఆయనే ఇన్వాల్వ్ అయ్యారు. మ్యూజిక్ సిట్టింగ్స్‌లోనూ ఆయనే ఉన్నారు. నిర్మాతగా ఆయన గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు దర్శకుడిగా ఆయన టాలెంట్ అందరూ చూస్తారు. సందీప్ వంగాతో ఎలా సింక్ అయ్యానో.. అభిషేక్ నామా గారితోనూ అలానే సింక్ అయ్యాను. ఆయనకు మ్యూజిక్ మీద చాలా పట్టుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు