ఇంటర్వ్యూ : శ్రీ విష్ణు – “గాలి సంపత్”లో నాది రాజేంద్ర ప్రసాద్ గారి కెమిస్ట్రీ చాలా బాగుంటుంది

Published on Mar 10, 2021 4:00 pm IST

ఎప్పటి నుంచో టాలీవుడ్ లో ఉండి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోల్లో శ్రీ విష్ణు కూడా ఒకడు. తన గత సినిమాల్లో ఏ సినిమాకు రాని హైప్ ను లేటెస్ట్ “గాలి సంపత్”కు తెచ్చుకోగలిగాడు. మరి ఈ మహాశివరాత్రి కానుకగా విడుదల కాబోతున్న తరుణంలో శ్రీ విష్ణు నుంచి ఓ ఇంటర్వ్యూ తీసుకున్నాం సో తాను ఎలాంటి విషయాలు పంచుకున్నాడో చూద్దాం.

 

అనీల్ రావిపూడికి యెస్ చెప్పడానికి గల కారణం ఏంటి?

అనీల్ గారు నాకు ఎప్పటి నుంచి చాలా సపోర్టివ్ గా ఉండేవారు. కానీ ఓరోజు నన్ను పిలిచి ఈ లైన్ చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ మొత్తం స్టోరీతో వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఫాథర్ రోల్ లో చేస్తారని చెప్పారు అంతే ఇక ఏం ఆలోచించకుండా ఓకే చెప్పేసాను.

 

ఇంతకీ గాలి సంపత్ ఎవరు మీరా లేక రాజేంద్ర ప్రసాద్ గారా.?

ఈ కథలో నేను రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరూ కీ రోల్స్ లో కనిపిస్తాం. అలా ఇద్దరికీ సేమ్ ఇంపార్టెన్స్ స్క్రిప్ట్ లో కనిపిస్తుంది అందుకు మేమిద్దరం లేకుండా ఈ సినిమా కంప్లీట్ గా అనిపించదు. మా ఇద్దరి మధ్యలో వచ్చే ఒక పాయింట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

 

ఈ సినిమాలో మీ రోల్ కోసం చెప్పండి?

నేను జస్ట్ సింపుల్ అండ్ రెస్పాన్సబుల్ గా కనిపించే యువకుడిలా కనిపిస్తా..మరి నా లాంటి వాడు ఓ పాయింట్ దగ్గర మా నాన్నని మార్చాలని చూడడానికి ట్రై చేస్తే వారి మధ్య ఈగో వల్ల ఏం జరిగింది? ఆ రిలేటెడ్ ఎమోషన్స్ కనిపిస్తాయి.

 

రాజేంద్ర ప్రసాద్ గారితో ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది?

ఆయన పని చేసాక ఖచ్చితంగా నా నటన ఇంప్రూవ్ అయ్యిందని చెప్పగలను. షూట్ కు ముందు మేము మా రోల్స్ కోసం చాలా మాట్లాడుకునేవాళ్ళం, నేను ఆయన్ని చాలా ప్రశ్నలే అడిగేసేవాడిని ఇన్ని సినిమాలు ఎలా చెయ్యగలిగారు? ఆయన లైఫ్ కోసం చాలా తెలుసుకున్నాను. ముఖ్యంగా మా ఇద్దరి కెమిస్ట్రీ ఈ సినిమాలో పెద్ద హైలైట్ అవుతుంది.

 

మీ యాక్టింగ్ స్టైల్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవుతారు మీ రోల్స్ కి?

ఒక్కసారి నేను సెట్స్ లోకి అడుగు పెడితే నేనొక నటుణ్ని అనే మాట మర్చిపోతాను ఆ రోల్ నేనే అని అనుకుంటా దీన్ని రాజేంద్ర ప్రసాద్ కూడా చూసి ఎందుకు ఏం మాట్లాడవు అని అడిగేవాళ్ళు. బ్లాంక్ గా ఓపెన్ మైండ్ తో వెళ్తాను నా రోల్ చేసి వచ్చేస్తాను అంతే.

 

మరి మీరిక కమర్షియల్ సినిమాలు చెయ్యరా?

నేనేం అనుకుంటా అంటే డబ్బులు తీసుకొచ్చే ఏ సినిమా అయినా కూడా కమర్షియల్ సినిమాలు అనే అనుకుంటా..మీరు గమనించారో లేదో నేను ఇప్పటి వరకు సినిమా సినిమాలు అన్నీ చాలా నాచురల్ గా స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ఉంటాయి. ఒకవేళ కథలో మంచి ఎమోషన్స్ ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను.

 

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

రాజ రాజ చోర కంప్లీట్ అయ్యిపోయింది. ఇంకా అర్జున ఫాల్గుణ 60 పర్సెంట్ అయ్యింది. అలాగే ఒకటి పోలీస్ డ్రామా, ఇంకో రెండు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు నా సినిమాలను, నా వర్క్ ని ఆదరిస్తున్నారు అది నాకు చాలా ఎంకరేజ్మెంట్ గా అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :