ఇంటర్వ్యూ : రకుల్ ప్రీత్ సింగ్ – చిరు గారి కాంప్లిమెంట్స్ ఎప్పిటికీ మర్చిపోలేను.

ఇంటర్వ్యూ : రకుల్ ప్రీత్ సింగ్ – చిరు గారి కాంప్లిమెంట్స్ ఎప్పిటికీ మర్చిపోలేను.

Published on Oct 8, 2015 2:03 PM IST

rakul-preethi1

ప్రస్తుతం టాలీవుడ్ గోల్డెన్ గర్ల్ అనే పేరుతో వరుసగా టాలీవుడ్ టాప్ స్టార్స్ తో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ భామ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్ లీ’ సినిమాతో త్వరలో మన ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 8 రోజులే ఉండడం వలన అప్పుడే ప్రమోషన్స్ మొదలు పెట్టింది. మరి అక్టోబర్ 16న రిలీజ్ కానున్న బ్రూస్ లీ గురించి రకుల్ ప్రీత్ సింగ్ ఏమి చెప్పిందో తన మాటల్లోనే.. మీ కోసం..

ప్రశ్న) ‘బ్రూస్ లీ’ అనే సినిమా మీ కెరీర్ కి ఎంత ముఖ్యమైందని అనుకుంటున్నారు.?
స) బ్రూస్ లీ సినిమాతో బిగ్ హీరోయిన్ అనే లీగ్ లోకి నేను ఎంటర్ అవుతా అనుకుంటున్నాను. అలాగే నా కెరీర్ కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ బ్రూస్ లీ సినిమా అవుతుందని భావిస్తున్నాను.

ప్రశ్న) బ్రూస్ లీ సినిమా చేస్తున్న టైంలో మీకు కలిగిన మర్చిపోలేని అనుభూతులు ఏమున్నాయి.?
స) బ్రూస్ లీ లాంటి సినిమా చెయ్యడం లైఫ్ టైం లో ఒక్కసారి వచ్చే అనుభవం. ఎందుకంటే మొదటిసారి స్టార్ హీరో అయిన రామ్ చరణ్ తో కలిసి పనిచేసే అవకాశం రావడం, అలాగే లెజెండ్రీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవిగారితో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

ప్రశ్న) మెగాస్టార్ చిరంజీవిగారితో పని చేసిన అనుభవం ఎలా ఉంది.?
స) అదొక మరచిపోలేని అద్బుతమైన అనుభవం. చిరంజీవి గారు సెట్లో ఉన్న రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన విత్ మేకప్ తో అందరికంటే ముందే సెట్ కి వచ్చేస్తారు. షూటింగ్ టైంలో ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయన నాకిచ్చిన కాంప్లిమెంట్స్ ని నేనెప్పటికీ మర్చిపోలేను.

ప్రశ్న) చిరు గారు ఏం కాంప్లిమెంట్స్ ఇచ్చారో కాస్త విడమర్చి చెప్పగలరా.?
స) చిరు గారు లే చలో సాంగ్ చూసిన తర్వాత, నేను చాలా అందంగా ఉన్నానని, ఆన్ స్క్రీన్ పెర్ఫార్మన్స్ పరంగా నాలో ఉన్న కాన్ఫిడెన్స్ ని ఆయన మెచ్చుకున్నారు. నాకు ఆ కాంప్లిమెంట్స్ ఒక డ్రీమ్ లా అనిపించింది. అందుకే ఆ డ్రీమ్ నుంచి బయటకి రావాలనిపించలేదు.

ప్రశ్న) రామ్ చరణ్ తో పనిచేయడం ఎలా అనిపించింది.?
స) రామ్ చరణ్ అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు, అలాగే తనొక స్టార్ హీరో కానీ తను మాత్రం చాలా సింపుల్ గా అందరితో బాగా జోవియల్ గా ఉంటారు. అలాగే మెరుపుతీగలాగా డాన్సులు చేస్తాడు. అతని స్టెప్స్ మరియు స్పీడ్ అందుకోవడానికి బాగా కష్టపడ్డాను. అలాగే ఈ సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ రాకింగ్ అని చెప్పాలి, అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.

ప్రశ్న) బ్రూస్ లీలో మీ పాత్ర గురించి చెప్పండి.?
స) నేను రియా అనే వీడియో గేమ్ డెవలపర్ గా కనిపిస్తాను. నా పాత్రలో చాలా కామెడీ ఉంటుంది. నా పాత్రని తీర్చిదిద్దడంలో, అలాగే నా స్టైలింగ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. నన్ను గ్లామరస్ గా చూపిన క్రెడిట్ మొత్తం శ్రీను వైట్ల గారికే చెందుతుంది.

ప్రశ్న) ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఉండడాన్ని ఎలా ఫీలవుతున్నారు.?
స) నాకు ఈ నెంబర్ వన్ గేమ్ మీద నమ్మకం లేదు. నా దగ్గరికి వచ్చిన సినిమాలను నేను చేస్తున్నాను. ఆ సినిమాల కోసం బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాను. నా కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి బిగ్ బడ్జెట్ స్టార్ హీరోస్ సినిమాలలో చేయుడం నా అదృష్టం.

ప్రశ్న) మీరు బాగా పొడవున్నారు., హీరోల విషయంలో మీ హైట్ ఎప్పుడైనా ఇబ్బంది కలిగించిందా.?
స) నో, అది అసలు సమస్యే కాదండి.. ప్రతి ఒక్కరూ వారి పర్సనాలిటీ విషయంలో, వారిని స్క్రీన్ పై ఎలా చూపిస్తున్నారు అనే విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు.

ప్రశ్న) బ్రూస్ లీ సెట్స్ లో షారుఖ్ ఖాన్ ని మీట్ అవ్వడం ఎలా అనిపించింది.?
స) షారుఖ్ ఖాన్ మా సెట్స్ కి రావడం అందరికీ ఒక సర్ప్రైజ్.. మేము ఒక సాంగ్ షూట్ లో ఉన్నాం, సడన్ గా అందరూ అక్కడి నుంచి పరిగెత్తుతూ ఒకరికి దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత మాకు తెలిసింది వచ్చింది షారుఖ్ ఖాన్ అని. మేము షారుఖ్ తో చాలా సేపు మాట్లాడాము. అలాగే షారుఖ్ కూడా సాంగ్ లోని కొంత భాగాన్ని చూసి ఎంజాయ్ చేసారు.

ప్రశ్న) మహేష్ బాబు బ్రహ్మోత్సవం మిస్ అయినందుకు ఫీల్ అయ్యారా.?
స) కచ్చితంగా బాధ ఉంటుంది కదా.. ఆ విషయంలో చాలా నిరుత్సాహపడ్డాను. కానీ నాకు ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉందనుకుంటున్నాను. కచ్చితంగా భవిష్యత్తులో మహేష్ బాబుతో కలిసి పనిచేసే ఛాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను.

ప్రశ్న) రీసెంట్ గా వస్తున్న వార్తల ప్రకారం మీ రెమ్యునరేషన్ బాగా పెంచేసారని అంటున్నారు. దానిపై మీ కామెంట్.?
స) నాకు తెలిసి నా ప్రతి సినిమాకి నేను పాపులర్ అవుతున్నాను. అలాగే నాకు మంచి డిమాండ్ ఉన్నప్పుడు నా రెమ్యునరేషన్ పెంచడంలో ఎలాంటి తప్పు లేదనుకుంటా..

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?
స) ప్రస్తుతానికైతే ఎన్.టి.ఆర్ తో నాన్నకు ప్రేమతో చేస్తున్నాను. అలాగే త్వరలో అల్లు అర్జున్ తో చేయనున్న సరైనోడు సెట్ లో జాయిన్ అవుతాను.

ప్రశ్న) ఫైనల్ గా బ్రూస్ లీ గురించి ప్రేక్షకులకు ఏం చెప్తారు.?
స) శ్రీను వైట్ల గారి ట్రేడ్ మార్క్ ఉన్న అన్ని అంశాలు ఉంటూనే మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్. రామ్ చరణ్ సినిమాకి స్పెషల్ హైలైట్ అవుతుంది. తనతో పాటు సిస్టర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది.

తాజా వార్తలు