ఇంటర్వ్యూ : రెజినా : నా పాత్ర ప్రతి అమ్మాయికీ ఎక్కోడో ఒక దగ్గర కనెక్టవుతుంది !
Published on Aug 25, 2016 4:06 pm IST

regina
ఎస్ఎమ్ఎస్ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి పవర్, పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ వంటి విజయాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్న హీరోయిన్ రెజినా తాజాగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ‘జ్యోఅచ్యుతానంద’ చిత్రం చేసి మరికొద్ది రోజుల్లో బాలీవుడ్ లోకి సైతం అడుగుపెడుతోంది. ఈ సందర్బంగా ఆమెతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం…

ప్ర) శ్రీనివాస్ అవసరాలతో పనిచేయడం ఎలా ఉంది ?

జ) శ్రీనివాస్ అవసరాల మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. ఇప్పటి పరిశ్రమకు ఆయన లాంటి దర్శకులు చాలా అవసరం. ఆయనతో పనిచేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మన నుండి ఆయనకు ఏమి కావాలో చాలా ఈజీగా రాబట్టుకుంటారు.

ప్ర) జ్యో అచ్యుతానంద సెట్స్ లో మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా ?
జ) ఈ సినిమాకి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సెట్స్ లో పనిచేసేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ పనిచేసేవాళ్ళం. ఇంతకూ ముందు సినిమాలకన్నా ఈ సినిమాకి పనిచేయడం చాలా మంచి అనుభవం.

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెబుతారా ?
జ) ఈ సినిమాలో నా పాత్ర ఒక హీరోయిన్ గా కాకుండా మామూలు అమ్మాయిలా ఉంటుంది. సాధారణ అమ్మాయిలో ఉండే ప్రతి క్వాలిటీ నా పాత్రలో ఉంటుంది. నా క్యారెక్టర్ ప్రతి అమ్మాయికీ ఎక్కడో ఒక దగ్గర కనెక్టవుతుంది.

ప్ర) బాలీవుడ్ ఆంఖేన్ సినిమాకి రెఫర్ చేశారని విన్నాం. నిజమేనా ?
జ) లేదు. అది నిజం కాదు. వాళ్ళే నా సినిమాలు చూసి నన్ను అప్రోచ్ అయ్యారు.  అంతా 3, 4 రోజుల్లో జరిగిపోయింది.

ప్ర) అమితాబ్ తో పనిచేయడం ఎలా ఉంది ?
జ) అమితాబ్.. గొప్ప నటుడే కాక మంచి మనిషి కూడా. మొదట ఆయనతో పనిచేయడం గురించి భయపడ్డా. కానీ ఆయన నాకు చాలా కంఫర్ట్ ఇచ్చారు. నా ఎంట్రీ అప్పుడు కూడా హీరోయిన్ నేనేనని అందరికీ ఆయనే పరిచయం చేశారు. ఆయనతో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను.

ప్ర) శంకర సినిమా రిలీజ్ పట్ల మీ ఫీలింగ్ ?
జ) సంతోషంగా ఉంది. చాలా రోజుల క్రితం చేసిన సినిమా. తమిళంలో మౌనగురు సినిమాలు ఎలా విజయం సాధించిందో ఇది కూడా అలాంటి సక్సెస్ సాదిస్తుందని నా నమ్మకం.

ప్ర) నాగ శౌర్య, నారా రోహిత్ లతో బాండింగ్ ఎలా కుదిరింది ?
జ) నారా రోహిత్ తో సంకర అనే సినిమా చేశాను. అప్పుడే మా ఇద్దరికీ మంచి బాండింగ్ కుదిరింది. అసలు ఈ సినిమాలో ఎందుకు చెయ్యాలో రోహిత్ 10 నిమిషాలు నాకు వివరించాడు కూడా. ఇక నాగ శౌర్యతో వర్క్ చాలా ఫన్నీగా, హ్యాపీగా సాగి పోయింది.

ప్ర) బాలీవుడ్ లో రాణించాలంటే బాగా కష్టపడాలేమో ?
జ) అవును బాలీవుడ్ లో సక్సెస్ కావాలనుంటే బాగా కష్టపడాల్సిందే. అక్కడంతా పర్ఫెక్ట్ గా, ప్రొఫెషనల్ గా ఉంటుంది. సో.. కష్టపడక తప్పదు.

ప్ర) ఈ సినిమా ఎండింగ్ హ్యాపీ ఎండింగా.. లేకపోతే శాడ్ ఎండింగా ?
జ) ఏమో సినిమా చూసి మీరే డిసైడ్ చెయ్యాలి. నాకైతే సినిమా హ్యాపీ ఎండింగ్ అనే అనిపించింది. మీకేమనిపిస్తుందో చూడండి.

ప్ర) శ్రీనివాస్ అవసరాల హీరోగా, మీరు హీరోయిన్ గా ఓ సినిమా చేస్తారని విన్నాం. నిజమేనా ?
జ) లేదు ఆ సినిమా చెయ్యట్లేదు. ఫస్ట్ హంటర్ సినిమాని రీమేక్ చేయాలని అనుకున్నాం. కానీ అది వర్కవుట్
కాలేదు.

 
Like us on Facebook