ఇంటర్వ్యూ : సుమంత్ అశ్విన్ – నువ్వే కావాలి, మనసంతా నువ్వే ఫీల్ కొలంబస్ లో ఉంటుంది.

ఇంటర్వ్యూ : సుమంత్ అశ్విన్ – నువ్వే కావాలి, మనసంతా నువ్వే ఫీల్ కొలంబస్ లో ఉంటుంది.

Published on Oct 20, 2015 6:07 PM IST

sumanth-ashwin
ఈ ఏడాది ‘కేరింత’ సినిమాతో హిట్ అందుకున్న యంగ్ హీరో సుమంత్ అశ్విన్ నుంచి వస్తున్న మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కొలంబస్’. సుమంత్ అశ్విన్ సరసన అందాల భామలు సీరత్ కపూర్, మిస్తీలు జోడీ కట్టారు. అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా ఈ గురువారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ తో కాసేపు ముచ్చటించాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) కేరింత తర్వాత వస్తున్న ‘కొలంబస్’ సినిమా ఎలా ఉండబోతుంది.?
స) కొలంబస్ అనేది ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్. సినిమా స్టార్టింగ్ నుంచి చివరి దాకా నవ్విస్తూనే ఒక మంచి లవ్ ఫీలింగ్ కూడా ఉంటుంది. నేను ఈ సినిమా చూసుకున్నాక నాకు మనసంతా నువ్వే, నువ్వే కావాలి సినిమాలు గుర్తుకు వచ్చాయి. కథ వేరైనా ఆ సినిమాల్లా నవ్విస్తూనే మంచి ఫీల్ ని ఇచ్చే సినిమా ‘కొలంబస్’. ఇప్పటికే ట్రైలర్ చూసిన వారు ఈ సినిమా అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనుకుంటున్నారు, కానీ వారి అనుకున్నదానికి భిన్నంగా ఉంటుంది.

ప్రశ్న) కొలంబస్ లో మీ రోల్ ఎంత డిఫరెంట్ గా ఉండబోతోంది.?
స) గత సినిమాలకంటే ఈ సినిమాలో నా పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది. చాలా జోవియల్ గా ఉండే కాలేజ్ కుర్రాడు. కానీ హీరో పాత్రకి మొదటి నుంచి ఒక గోల్ ఉంటుంది. దానిని లీగల్ గా అయినా, ఇల్లీగల్ గా అయినా, అవసరం అయితే జైలుకి వెళ్లయినా దాన్ని సాధించాలి అనుకుంటుంటాడు. అదేంటి అనేది మీరు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

ప్రశ్న) కొలంబస్ ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్, అందులోనూ ఇద్దరు అందాల భామలు ఉన్నారు. రొమాన్స్ కాస్త శృతి మించి ఉంటుందనుకోవచ్చా.?
స) మీరన్నట్టు ఇద్దరు భామల గ్లామర్ ఫీస్ట్ సినిమాకి ఒక హైలైట్ అవుతుంది. ఇద్దరూ చాలా బాగా చేసారు. ఇక మీరన్నట్టు యువతకు కావాల్సిన రొమాన్స్ ఈ సినిమాలో ఉంటుంది. అలా అని వల్గర్ గా ఉండదు. యువత తన ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమాలా ఉంటుంది.

ప్రశ్న) కొత్త డైరెక్టర్ రమేష్ సామల గురించి చెప్పండి.?
స) ఆయనతో నేను నాన్న రెండేళ్ళ నుంచి కలిసి ట్రావెల్ చేస్తున్నాం. చాల అతాలేంట్ ఉన్న వ్యక్తి. నాన్న గారే(ఎంఎస్ రాజు) ఈ సినిమా కథ – స్క్రీన్ ప్లే అన్దించాదు. ఆయన డైరెక్టర్ కోసం అనుకున్నప్పుడు రమేష్ అయితే బెటర్ అని ఫిక్స్ చేసేసారు. ఆయన కూడా ఎంతో డెడికేషన్, క్లారిటీ ఉన్న డైరెక్టర్. సినిమాని చాలా బాగా చేసాడు.

ప్రశ్న) సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయిన మీ నాన్నగారికి కథల మీద మంచి పట్టుంది. సినిమాల ఎంపికలో ఆయన ఇన్వాల్వ్ మెంట్ ఎంతవరకూ ఉంటుంది.?
స) కచ్చితంగా నా ప్రతి సినిమాలోనూ ఆయన ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది. ఆయన జడ్జ్ మెంట్ పక్కాగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఆయన ఇన్వాల్వ్ మెంట్ లేని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

ప్రశ్న) అసలు ఈ సినిమాకి కొలంబస్ అనే టైటిల్ ని ఎందుకు పెట్టారు.?
స) ఈ సినిమా కథ రియల్ కొలంబస్ పాత్రకి దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ పేరు పెట్టాం. మామూలుగా కొలంబస్ అమెరికాని కనిపెడితే, ఈ సినిమాలో హీరో ఒకటి కనిపెడతాడు అదేంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్రశ్న) ఎక్కువగా లవ్ స్టోరీస్ నే చేయడానికి గల కారణం ఏంటి.?
) నేను ప్రభాస్ గారిలా 6 ఆడుగులు పొడవు ఉండి, భారీ పర్సనాలిటీ ఉన్న వ్యక్తిని కాదు. ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్నాను. ఆవేశపడి యాక్షన్ సినిమా అని వెళ్తే అది ఫ్లాప్ అయితే, ఎటూ కాకుండా పోతాను. అందుకే స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను.

ప్రశ్న) ఇంత హడావిడిగా సినిమాని రిలీజ్ చెయ్యడానికి గల కారణం ఏంటి.?
స) ముందుగా ఈ సినిమాని దీపావళి కానుకగా అనుకున్నాం. కానీ సడన్ గా ఫెస్టివల్ సీజన్ ఖాళీ అవ్వడంతో రిలీజ్ చేసెయ్యాలి అనుకున్నాం. తక్కువ టైం అయినా సినిమాని ప్రేక్షకుల దగ్గరకి తీసుకెళ్ళాం.

ప్రశ్న) మీ కెరీర్లో అప్పుడే సక్సెస్ ఫెయిల్యూర్స్ ని చూసారు. ఫెయిల్ అయినప్పుడు ఎలా ఫీలవుతారు.? అలాగే ఈ సినిమా సక్సెస్ పై ఎంత నమ్మకంగా ఉన్నారు.?
స) నాను నుంచి వస్తున్న ఆరవ సినిమా ఇది. ఇప్పటి వరకూ 3 సినిమాలు ఆడాయి, రెండు ఆడలేదు. ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఫెయిల్ అయినప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ వదిలేసినంత ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అంతలా ప్రేమించి సినిమా చేస్తాం. ఇక ఈ సినిమాలో యాక్షన్ లేకపోయినా ఓ యాక్షన్ సినిమాలో ఉండే పంచ్ ఉంటుంది. అది ఆడియన్స్ కి కచ్చితంగా కనెక్ట్ అవుతుంది, సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు