ఇంటర్వ్యూ : వరుణ్ తేజ్ – కంచెలోని రియలిస్టిక్ ఎలిమెంట్స్ అందరినీ సర్ప్రైజ్ చేస్తాయి.

ఇంటర్వ్యూ : వరుణ్ తేజ్ – కంచెలోని రియలిస్టిక్ ఎలిమెంట్స్ అందరినీ సర్ప్రైజ్ చేస్తాయి.

Published on Oct 20, 2015 3:58 PM IST

varun-tej

గత ఏడాది ‘ముకుంద’ సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన హీరో వరుణ్ తేజ్. మొదటి సినిమాతోనే డిఫరెంట్ అటెంప్ట్ చేసిన వరుణ్ తేజ్ తన రెండవ సినిమాతో అంతకు మించిన డిఫరెంట్ సినిమాతో మన ముందుకు రానున్నాడు. ఆ సినిమానే ‘కంచె’. వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ ప్రేమ కథ అక్టోబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేము కాసేపు వరుణ్ తేజ్ తో ముచ్చటించి కంచె విశేషాలను తెలుసుకున్నాం. ఆ వివరాలు మీ కోసం..

ప్రశ్న) మొదటి సినిమా ముకుంద అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఆ టైములో మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటి.?
స) ముకుంద సినిమా నుంచి ఒక నటుడిగా చాలా నేర్చుకున్నాను. అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నది ఉన్నట్టుగా ఎలాంటి దాపరికం లేకుండా ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ముఖ్యంగా చిరంజీవి గారు నేను ఎక్కడెక్కడ నటుడిగా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్పడమే కాకుండా నా డాన్సులకు కాంప్లిమెంట్ ఇచ్చాడు.

ప్రశ్న) అసలు కంచె సినిమా ఆఫర్ ఎలా వచ్చింది.?
స) గమ్యం సినిమా టైం నుంచి నేను క్రిష్ కి చాలా పెద్ద అభిమానిని. చాలా సంవత్సరాల నుంచి తను తీయబోయే ఒక స్పెషల్ ఫిల్మ్ ని నాతో చేస్తానని చెప్తూ ఉండేవాడు. ఆ సినిమానే ‘కంచె’.

ప్రశ్న) కంచెలో మీరు చేసిన ధూపాటి హరిబాబు పాత్ర గురించి చెప్పండి.?
స) ఫస్ట్ టీజర్ లోనే నా పాత్ర పేరు ధూపాటి హరిబాబు అని రివీల్ చేసేసారు. ధూపాటి హరిబాబు అనే కుర్రాడి జర్నీ ఎందనేదే ఈ సినిమా కథ. అతని ప్రేమ కథ ఏమైంది, అసలు ఎలా అతని వరల్డ్ వార్ II లో అడుగుపెట్టాల్సి వచ్చింది అనేదే కథ. చాలా చాలెంజ్ గా తీసుకొని చేయాల్సిన పాత్ర, అలాగే నటనకి ఎక్కువ ఆస్కారం ఉన్న పాత్ర ఇది.

ప్రశ్న) ఈ రోల్ కోసం మీరు స్పెషల్ గా ఏమన్నా ప్రిపేర్ అయ్యారా.?
స) మొదట ఈ సినిమా కోసం నా భాషని అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ఉండేలా కేర్ తీసుకున్నాను. దానికోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. అలాగే అప్పుడు బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకోవడానికి చాలా హాలీవుడ్ సినిమాలు చూసాను. వీటితో పాటు నా పాత్ర విషయంలో క్రిష్ ఎంతో సాయం చేసాడు. అలాగే నాను నుంచి మంచి నటనని రాబట్టుకున్నాడు.

ప్రశ్న) ఇదొక డిఫరెంట్ ఫిల్మ్.. మరి ఈ సినిమా జర్నీ ఎలా అనిపించింది.?
స) ఈ సినిమాని షూట్ చేయడం చాలా కష్టతరమైన పని, వార్ సీక్వెన్స్ ని మేము ఎక్కువ రోజులు షూట్ చేసాం. అలాగే కొన్ని రియల్ వెపన్స్ ని కూడా సినిమాలో ఉపయోగించాం. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవడం వలన అన్నీ అనుకున్నట్టుగానే జరిగాయి. ముఖ్యంగా ఈ సినిమాలో అన్నిటినీ రియలిస్టిక్ గా ఉండేలా కేర్ తీసుకున్నాం, అది అందరికీ బాగా నచ్చుతుంది.

ప్రశ్న) ఈ సినిమా షూటింగ్ టైములో జరిగిన ఓ మరచిపోలేని అనుభవాన్ని మాతో పంచుకోగలరా.?
స) ఈ సినిమాలో ఓ మేజర్ పార్ట్ ని జార్జియాలో షూట్ చేసాం, కానీ హైదరబాద్ నుంచి చాలా తక్కువ మంది వెళ్లాం. కావున మాకు ఎక్స్ట్రా సపోర్ట్ లేకపోవడం వలన మాకు మేమే మేకప్ రూంలో ఆ వార్ డ్రెస్ లు వేసుకోవడానికి సాయం చేసుకొనే వాళ్ళం. అందరితో అలా కలిసి ఎంజాయ్ చేసిన డేస్ మరచిపోలేనివి.

ప్రశ్న) డైరెక్టర్ క్రిష్ తో పనిచేయడం ఎలా ఉంది.?
స) సూపర్బ్ టాలెంట్ ఉన్న డైరెక్టర్ క్రిష్, ఈ జర్నీలో క్రిష్ నుంచి చాలా నేర్చుకున్నాను. క్రిష్ చాలా బ్రిలియంట్ ఎందుకు అంటే క్రిష్ ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకోవాలని ట్రై చేస్తుంటాడు, అలాగే వాటిని తన సినిమాలలో నటీనటుల మీద ప్రయోగించి అందులో బెస్ట్ రాబట్టుకుంటూ ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే క్రిష్ టఫ్ టాస్క్ మాస్టర్ ఎందుకంటే తను అనుకున్నది వచ్చే వరకూ అసలు వదలడు.

ప్రశ్న) లోఫర్ సినిమా నితిన్ చేయాల్సింది, కానీ ఆ ఆఫర్ మీకెలా వచ్చింది.?
స) నేను కంచె సినిమా షూటింగ్ చేస్తున్న టైంలో ఈ స్క్రిప్ట్ నా దగ్గరికి వచ్చింది. పూరి గారు వచ్చి కథ చెప్పి నీకు నచ్చితేనే చేద్దాం అని అన్నారు. నాకు కథ కంప్లీట్ గా నచ్చింది. ఆ తర్వాత నేను నితిన్ తో మాట్లాడి స్క్రిప్ట్ కి ఓకే చెప్పాను. నాకు నితిన్ తో మంచి సాన్నిహిత్యం ఉంది, ఎందుకంటే తను చేసిన హార్ట్ ఎటాక్ సినిమా ముందు నేనే చెయ్యాలి కానీ ఫైనల్ గా నితిన్ చేసాడు.

ప్రశ్న) మీ సిస్టర్ నిహారిక హీరోయిన్ గా మారాలనుకుంటున్నా అని చెప్పినప్పుడు మీ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యింది.?
స) నిహారిక హీరోయిన్ అవ్వాలన్న నిర్ణయం సడన్ గా తీసుకున్న నిర్ణయం కాదు. చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. తన నిర్ణయాన్ని ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేసారు. మొదట్లో మెగా ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ బేస్ చూసుకొని వద్దనే అన్నాం, కానీ ఫైనల్ గా మనస్పూర్తిగానే అందరం తన నిర్ణయాన్ని ఓకే చేసాం.

ప్రశ్న) ఫైనల్ గా తెలుగు ప్రేక్షకులకు కంచె గురించి ఏం చెప్తారు.?
స) సూటిగా కొట్టినట్టు ఉండే సినిమా కంచె. అలాగే టాలీవుడ్ కి ఓ కొత్త తరహా చిత్రం. కంచె కోసం ఎంచుకున్న కథ, నేపధ్యం మరియు రియలిస్టిక్ గా ఉండే విజువల్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ అవుతాయి. నా పరంగా నేను ఈ సినిమాకి న్యాయం చేసానని అనుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులు కూడా సినిమా చూసి మా ప్రయత్నాన్ని, నా పెర్ఫార్మన్స్ ని మెచ్చుకుంటే చాలా ఆనందంగా ఫీలవుతాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు