ఇంటర్వ్యూ: దేవి ప్రసాద్- తెల్లకాగితంలా వెళ్ళాలి, దర్శకుడికి కావలసింది రాసుకుంటాడు.

ఇంటర్వ్యూ: దేవి ప్రసాద్- తెల్లకాగితంలా వెళ్ళాలి, దర్శకుడికి కావలసింది రాసుకుంటాడు.

Published on Nov 11, 2019 1:21 PM IST

నూతన దర్శకుడు విశ్వనాథ్ మాగంటి డైరెక్షన్లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, విశ్వంత్,హర్షిత ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ తోలుబొమ్మలాట. పల్లెటూరి నేపథ్యంలో నడిచే ఆహ్లదకరమైన కథగా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈసంధర్భంగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేసిన నటుడు మరియు దర్శకుడు దేవి ప్రసాద్ మీడియాతో ముచ్చటించారు.

తోలు బొమ్మలాట మూవీ గురించి చెప్పండి?

తోలుబొమ్మలాట ఒక కుటుంబంలోని సభ్యుల మధ్య నడిచే కుటుంబ కథా చిత్రం. మనుషులలోని మంచి చెడులను, వాటి వలన కుటుంబంలో ఏర్పడే సమస్యల ఇతివృత్తాంగా తెరకెక్కింది.

దర్శకుడు విశ్వనాథ్ మాగంటి ఎలాంటి వారు?

దర్శకుడు విశ్వనాధ్ మాగంటి చాలా కూల్ గా ఉంటారు. ఎవరైనా ఒక నూతన దర్శకుడు లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ లేదా యాక్షన్ చిత్రాలతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు, కానీ విశ్వనాధ్ దానికి భిన్నంగా ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని ఎన్నుకున్నారు. తాను తీసిన సినిమా చూసి నలుగురు మంచి సినిమా చూశాం అని మెచ్చుకుంటే చాలు అనుకొనే తత్త్వం కల కుర్రాడు. దర్శకుడిగా అంత మంది నటులను చక్కగా హ్యాండిల్ చేశారు.

రాజేంద్ర ప్రసాద్ లాంటి నటుడితో చేసిన అనుభవం ఎలా ఉంది?

రాజేంద్ర ప్రసాద్ గారితో చేయాలని ఎప్పటి నుండో నాకు కోరిక ఉండేది. అది ఈచిత్రంతో నెరవేరింది. ఆయన ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. అలాగే ఈ చిత్రంలో చాలా మంది సీనియర్ నటులు ఉన్నారు. వారందరితో కలిసి చేసిన ప్రయాణంలో నాకు తెలియని అనేక విషయాలు నేర్చుకున్నాను.

మీరు కూడా దర్శకుడు కదా, దర్శకుడికి సలహాలు ఏమైనా ఇచ్చారా?

లేదండీ. ఎందుకంటే అనేక సినిమాలు చేసిన ఒక సినియర్ దర్శకుడికి కూడా మరొక దర్శకుడు చేసే సినిమా గురించి వారికంటే ఎక్కువ తెలియదు. ఒక నటుడిగా మనం నటిస్తున్నప్పుడు ఆదర్శకుడి దగ్గరికి తెల్ల కాగితంలా వెళ్ళాలి, దర్శకుడికి నచ్చినది దానిపై రాసుకుంటాడు.

తోలు బొమ్మలాట చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

ఒక విలేజ్ లో పెద్దాయన కొడుకు పాత్ర నాది. కెరీర్ కోసం పట్నం వెళ్లి అక్కడే స్థిరపడిన వ్యక్తిలా కనిపిస్తాను. అలాగే మనం, మన సంపాదన, భవిష్యత్తు అని అనే ఆలోచనా ధోరణి ఉంటుంది. అలాగని స్వార్ధం కూడుకున్న నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కాదు. సాధారణంగా అన్ని కుటుంబాలలో కనిపించే సహజమైన స్వభావం కలిగి ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు