ఇంటర్వ్యూ: జి నాగేశ్వర రెడ్డి- జనాలు నవ్వడం మరిచిపోయారు, అందుకే ఈ చిత్రం తీశా..!

ఇంటర్వ్యూ: జి నాగేశ్వర రెడ్డి- జనాలు నవ్వడం మరిచిపోయారు, అందుకే ఈ చిత్రం తీశా..!

Published on Nov 11, 2019 2:16 PM IST

సందీప్ కిషన్ తాజా చిత్రం తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్. దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. కేసుల కోసం అవస్థలు పడే అనుభవం లేని కుర్ర లాయర్ గా సందీప్ నటిస్తుండగా హీరోయిన్ హన్సిక మోత్వానీ లేడీ లాయర్ పాత్ర చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. ఈ సంధర్భంగా దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం.

 

తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ సినిమా గురించి చెప్పండి?

తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ పూర్తిగా కామెడీ బేస్డ్ మూవీ. ఈ రోజులలో మనుషులు డబ్బు వేటలో, అలాగే జాబ్స్ టెన్షన్స్ వలన నవ్వడం మానేశారు. అలాగే ఈ మధ్య టాలీవుడ్ లో పూర్తి స్థాయి కామెడీ చిత్రాలు రావడం తగ్గింది. అందుకే ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీగా తెరకెక్కించాం.

 

తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ టైటిల్ ఎంచుకోవడానికి కారణం?

మనకు చరిత్రలో తెనాలి రామ కృష్ణ తిమ్మిని బొమ్మి చేయగల సమర్ధుడు. మా చిత్రంలో లాయర్ గా హీరో పాత్ర కూడా అలాగే ఉంటుంది. అందుకే మా చిత్రానికి తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ అనే టైటిల్ పెట్టడం జరిగింది. తెనాలి రామ కృష్ణకు ఉండే అన్ని లక్షణాలు ఈ లాయర్ పాత్రకు ఉంటాయి.

 

సందీప్ కిషన్ పాత్ర ఎలా ఉంటుంది?

అసలు కాంప్రమైజ్ ఐతే కేసులు, గొడవలు, కోర్ట్ లు ఉండవు అనే ధోరణిలో ఉండే హీరో, ఒక కేసు విషయంలో నో కాంప్రమైజ్ అన్న స్థితికి చేరుతాడు. అలాంటి రెండు ఉద్దేశాలు కలిగిన హీరో పాత్రని కామిక్ గా తెరకెక్కించడం జరిగింది. గత చిత్రాలకు భిన్నమైన కొత్త ఇమేజ్ సందీప్ కిషన్ కి ఈ చిత్రంలో వస్తుంది.

 

హన్సిక గురించి చెప్పండి?

మహా మేధావి అనుకొనే ఇన్నోసెంట్ లాయర్ గా హన్సిక పాత్ర ఉంటుంది. ఆమెకు ఎంతో తెలుసు అనుకుంటుంది కానీ ఏమీ రాదు.

 

తమిళ యాక్టర్ వరలక్ష్మీ గారిని తీసుకున్నట్లున్నారు?

అవును ఆమెది ఈ చిత్రంలో కీలకమైన పాత్ర. భారీ ఇమేజ్ ఉన్న ఆమె చేత ప్రాధాన్యం లేని పాత్ర చేయిస్తే సినిమాకి నెగెటివి మార్క్స్ పడతాయి. అందుకే ఆమెను ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం తీసుకోవడం జరిగింది. ఈ మూవీ తరువాత ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.

 

ఈ మూవీ చిత్రీకరణలో సందీప్ కి గాయం ఐనట్టుంది?

అవును ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు బస్సు లో నుండి రౌడీలు అద్దాలు పగులగొట్టుకొని బయటకి రావాలి. ఆ సీన్ తీస్తున్నప్పుడు ఓ గాజు ముక్క సందీప్ కి గుచ్చుకోవడం జరిగింది. దానితో రెండు నెలలు షూటింగ్ వాయిదాపడింది.

 

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ చాలా మంది కమెడియన్స్ గురించి చెబుతారా?

 

ఈ మూవీలో కమెడియన్స్ గా నటించిన పోసాని, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్య కృష్ణల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. దొంగ సాక్ష్యాలు చెప్పేదిగా సత్య కృష్ణ కుటుంబం, ఏళ్ల నుండి కోర్ట్ చుట్టూ తిరిగే వాడిగా సప్తగిరి, ఒక పెద్ద క్రైమ్ లో సాక్షులుగా వెన్నల కిషోర్ మరియు అన్నపూర్ణమ్మ ఫ్యామిలీ కనిపిస్తారు. వీరి కామెడీ ట్రాక్ తెనాలి రామ కృష్ణ పాత్రకు మించి ఉంటుంది.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు