ఇంటర్వ్యూ: శేఖర్ చంద్ర- నేను మ్యూజిక్ డైరెక్టర్ కావడానికి ఆయనే స్ఫూర్తి

Published on Feb 17, 2020 2:31 pm IST

నచ్చావులే, నువ్విలా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ వంటి మ్యూజికల్ హిట్స్ సాధించిన చిత్రాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మీడియాతో ముచ్చటించారు. ఆయన సంగీతం అందించిన వలయం మూవీ ఈనెల 21న విడుదల కానుంది. అలాగే ఇటీవల విడుదలైన సవారీ చిత్రానికి ఆయన సంగీతం అందించారు.

 

చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎన్నాళ్లు అవుతుంది?

నేను కెరీర్ స్టార్ చేసి, 14 ఏళ్ళు అవుతుంది. 35 సినిమాల వరకు సంగీతం అందించాను. ఎక్కడికి పోతావు చిన్నవాడా, సవారి , కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన 118 వంటి చిత్రాలకు సంగీతం అందించాను. 118లో చందమామ… అనే సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. కళ్యాణ్ రామ్ గారు కూడా మెచ్చుకున్నారు. సవారి చిత్రంలో రెండు సాంగ్స్ బాగా యూత్ కి కనెక్ట్ అయ్యాయి. ఆ రెండు సాంగ్స్ పై బాగా టిక్ టాక్ లు చేస్తున్నారు.

 

14 ఏళ్ల కెరీర్ లో 35 సినిమాలంటే చాలా స్లోగా చేస్తున్నట్లున్నారు?

14ఏళ్లలో 35 సినిమాలు అంటే స్లోగా చేస్తున్నట్లే లెక్క. నేను ఏడాదికి కేవలం రెండు లేదా మూడు సినిమాలకంటే ఎక్కువ పనిచేయడం లేదు. ఇక పైన కొంచెం స్పీడ్ పెంచాలి.

 

ఓ పెద్ద కమర్షియల్ మాస్ మూవీకి సంగీతం అందించలేదనే బాధ ఉందా?

బిగ్ బ్యానర్ లో పెద్ద హీరోకి చేయలేదనే బాధ వుంది. ఓ పెద్ద హీరో సినిమాకి మ్యూజిక్ అందించినప్పుడు రీచ్ ఎక్కువ ఉంటుంది. దాని వలన జనాల్లోకి త్వరగా వెళ్ళగలం.

 

మెలోడీ బాగా చేస్తారు అనే మార్కు మీకు మైనస్ గా మారినట్టుంది?

ఒక విధంగా చెప్పాలంటే అవుననే చెప్పాలి. నేను మెలోడీ బాగా ఇస్తాను అని మార్కు పడటం వలన ఒక తరహా చిత్రాల కోసం నన్ను సంప్రదించడం లేదు, దాని వలన అవకాశాలు తగ్గుతున్నాయి. అది మైనస్ అని చెప్పాలి. కానీ నేను అన్ని తరహాల మ్యూజిక్ ఇవ్వగలను.

 

ఫాస్ట్ బీట్ సాంగ్ కి, మెలోడీ కి ఉండే డిఫరెన్స్ ఏమిటీ?

ఫాస్ట్ బీట్ సాంగ్ తో పోల్చుకుంటే మెలోడీ మెల్లగా ఆడియన్స్ కి చేరుతుంది. కానీ ఎక్కువ కాలం గుర్తిండిపోతుంది. ఫాస్ట్ బీట్ సాంగ్ త్వరగా ఎక్కుతుంది, తక్కువ కాలంలోనే ప్రభావం కోల్పోతుంది.

 

మీకు మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఎవరు స్ఫూర్తి?

నాకు చిన్నప్పటి నుండి ఏ ఆర్ రెహ్మాన్ అంటే చాలా ఇష్టం, ఆయన స్ఫూర్తి తోనే మ్యూజిక్ డైరెక్టర్ గా మారాను. అలాగే కీరవాణి గారి మ్యూజిక్, హిందీ మ్యూజిక్ అంతా వింటూ ఉంటాను.

 

భవిష్యత్తులో ఏ సినిమాలకు పనిచేస్తున్నారు?

నేను మ్యూజిక్ అందించిన వలయం మూవీ ఈనెల 21న విడుదల కానుంది. ఇక హుషారు మూవీ టీమ్ తో సాయి ధన్సిక ప్రధాన పాత్రలో బెక్కం వేణుగోపాల్ గారు ఓ సినిమా చేస్తున్నారు. దానికి కూడా మ్యూజిక్ అందిస్తున్నాను.

సంబంధిత సమాచారం :

More