ఇంటర్వ్యూ: ప్రీతీ అస్రాని- ప్రెజర్ కుక్కర్ అని టైటిల్ పెట్టడానికి కారణం అదే..!

Published on Feb 13, 2020 12:24 pm IST

సాయి రోనక్, ప్రీతి అస్రాని జంటగా దర్శకులు సుజోయ్ అండ్ సుశీల్ దర్వకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రెజర్ కుక్కర్. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. ఈ సంధర్భంగా హీరోయిన్ ప్రీతీ అస్రాని మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీ నేపథ్యం గురించి చెప్పండి?

నేను గుజరాత్ అమ్మాయిని, సినిమాలపై ఆసక్తితో నటిగా మారాను. మా అక్క ఓ టీవీ యాక్ట్రెస్, ఆమె స్ఫూర్తి తోనే నేను సినిమాలలోకి రావడం జరిగింది. గతంలోకొన్ని షార్ట్ ఫిలిమ్స్ తో పాటు ‘మళ్ళీ రావా’ సినిమాలో చేశాను,అలాగే పక్కింటి అమ్మాయి అనే ఓ సీరియల్ లో కూడా నటించడం జరిగింది. హీరోయిన్ గా ఇది నా మొదటి చిత్రం.

ప్రెజర్ కుక్కర్ అనే టైటిల్ పెట్టారు ఎందుకు?

ఈ టైటిల్ విన్నప్పుడు నాకు గమ్మత్తుగా అనిపించింది. బీటెక్ అపోయిన ఓ స్టూడెంట్ పై పేరెంట్స్, బంధువులు, స్నేహితుల నుండి అనేక ఒత్తిడులు ఉంటాయి. అతను అమెరికా వెళ్ళాలి అక్కడ సెటిల్ అవ్వాలనే ధోరణి వారిలో ఉంటుంది. దీని కారణంగా హీరో ప్రెజర్ కుక్కర్ లో ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే ఈ టైటిల్ పెట్టాము.

ఈ చిత్రంలో మీరు రోల్ ఎలా ఉంటుంది?

ఈ చిత్రంలో నా పాత్ర పేరు అనిత, ఒక సోషల్ యాక్టీవిస్ట్ గా కనిపిస్తాను, అలాగే ఇండిపెండెంట్ స్ట్రాంగ్ అమ్మాయిలా నా పాత్ర ఉంటుంది. హీరో కిషోర్ పాత్రకు విరుద్ధంగా అనిత పాత్ర ఉంటుంది.

ప్రెజర్ కుక్కర్ మూవీ యూత్ ఫుల్ సినిమానా?

ప్రెజర్ కుక్కర్ మూవీలో అని అంశాలు ఉంటాయి. కామెడీ, లవ్, ఎమోషన్స్ ఇలా అన్ని అంశాలు ఉంటాయి. సినిమా వాస్తవానికి దగ్గరగా చాలా రియలిస్టిక్ గా ఉంటుంది.

తెలుగు బాగా మాట్లాడుతున్నారు, మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా?

అవును ఈ సినిమాలో పాత్రకు నేనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాను . తెలంగాణ స్లాంగ్ నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పడం జరిగింది. రెండు మూడు టేక్ లు తీసుకున్నప్పటికీ కష్టపడి పూర్తి చేశాను.

గోపిచంద్ సిటీమార్ సినిమాలో చేస్తున్నట్లున్నారు?

అవును గోపించంద్ గారి సిటీమార్ సినిమాలో ఓ రోల్ చేస్తున్నాను. ఆ సినిమాలో నేను ఓ కబడ్డీ టీం కెప్టెన్ గా కనిపిస్తాను.

సంబంధిత సమాచారం :