స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముఖం ప్రస్తుతం ఇండియన్ 2 మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రెండింటికి దర్శకత్వం వహిస్తున్నారు. అతను ఇటీవల హైదరాబాద్‌లో గేమ్ ఛేంజర్ పాటల షెడ్యూల్‌ను పూర్తి చేసి ఇండియన్ 2 ప్రాజెక్ట్‌కి తిరిగి వెళ్లాడు. ఇప్పుడు కమల్ హాసన్ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను షేర్ చేశాడు. ఇండియన్ 2 షూటింగ్ ప్రస్తుతం తైవాన్‌లో జరుగుతోందని శంకర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఇదే విషయాన్ని వెల్లడించడానికి ఒక ఫోటో ను షేర్ చేయడం జరిగింది. అందులో అతను సీన్ పేపర్లు చదువుతున్నట్లు కనిపించాడు. ఈ ప్రాజెక్ట్ కోసం శంకర్ కొంతమంది హాలీవుడ్ టెక్నీషియన్స్ ని తీసుకున్నారు. ఈ విజిలెంట్ యాక్షన్ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సిద్ధార్థ్, సముద్రఖని, బాబీ సింహా మరియు నేదురుమూడి వేణు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ఎంటర్టైన్‌మెంట్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
#Indian2 at enthralling Taiwan pic.twitter.com/iAQdwyFWRj
— Shankar Shanmugham (@shankarshanmugh) April 2, 2023


