టిల్లు స్క్వేర్ నుండి నేడు ఇంట్రెస్టింగ్ అప్డేట్!

Published on Jun 5, 2023 2:01 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం సూపర్ హిట్ మూవీ డిజే టిల్లు కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చాలా నెలలుగా నిర్మాణంలో ఉంది, ఎట్టకేలకు, దాని గురించిన అప్డేట్ వస్తోంది. ఈ సినిమా మేకర్స్ సోషల్ మీడియాకు వెళ్లి ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు ఒక ముఖ్యమైన ప్రకటన చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమా రిలీజ్ డేట్‌కి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. మరి కొన్ని గంటల్లో సస్పెన్స్ వీడనుంది. ఇంతకుముందు అద్భుతం చిత్రానికి దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కనిపించనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ థ్రిల్లింగ్ మూవీకి రామ్ మిరియాల సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :