“బుజ్జీ ఇలా రా” లో సీఐ కేశవ నాయుడు గా ధనరాజ్!

Published on Aug 15, 2021 6:52 pm IST

సునీల్ మరియు ధనరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం బుజ్జీ ఇలా రా. ఇట్స్ ఎ సైకాలాజికల్ థ్రిల్లర్ అనే క్యాప్షన్ తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం లో చాందినీ అయ్యంగార్ హీరోయిన్ పాత్ర లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్ కొద్ది రోజుల క్రితం విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. సోషల్ మీడియా లో సైతం నెటిజన్లు పాజిటివ్ గా రెస్పాన్స్ అయ్యారు.

ఈ చిత్రం లో ధనరాజ్ సీఐ కేశవ నాయుడు పాత్ర లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా పేర్కొనడం జరిగింది. అందుకు సంబంధించిన పోస్టర్ ను నేడు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విడుదల చేయడం జరిగింది. పోస్టర్ లో ధనరాజ్ చాలా సీరియస్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమా లో ధనరాజ్ పోలీస్ పాత్ర లో కనిపిస్తూ ఉండటం తో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. గరుడవేగ చిత్రానికి పని చేసిన అంజి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించడం మాత్రమే కాకుండా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు జీ. నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి కథ మరియు స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. అగ్రహారం నాగిరెడ్డి మరియు సంజీవ రెడ్డి లు ఎస్ ఎన్ ఎస్ క్రియేషన్స్ LLP మరియు జీ. నాగేశ్వర్ రెడ్డి టీమ్ వర్క్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :