భయపెడుతున్న సలార్ ‘రాజమన్నార్’ !

Published on Aug 23, 2021 10:55 am IST


యాక్షన్ డైరెక్టర్ ‘ప్ర‌శాంత్ నీల్’ – నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న “సలార్” నుండి ఒక స్పెషల్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో కీలక పాత్ర ‘రాజమన్నార్’గా జగపతిబాబు నటిస్తున్నారు. కాగా తాజాగా జగపతిబాబు పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పూర్తి రఫ్ లుక్ తో ‘రాజమన్నార్’గా జగపతిబాబు భయపెడుతున్నారు. ఇక కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ను పెట్టాడు ప్రశాంత్ నీల్.

ఆ సాంగ్ ను స్టార్ హీరోయిన్ ‘తమన్నా’ చేత చేయించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సలార్ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. అందుకే ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయిస్తున్నాడు. కాగా కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ భారీ సినిమాకి రవి బాసృర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హోంబేలె పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :