రాజమండ్రిలో ఇంటిలిజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ !

27th, January 2018 - 04:45:07 PM

ఈరోజు విడుదలైన ఇంటిలిజెంట్ సినిమా టీజర్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ఫిబ్రవరి 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫిబ్రవరి 4 న రాజమండ్రి లోని గౌర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో జరగనుంది. చిత్ర యూనిట్ అందరు హాజరు కాబోతున్న ఈ ఫంక్షన్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. చిరంజీవి కొండవీటి దొంగ సినిమాలోని చమకు చమకు పాట ను ఈసినిమాలో రీమిక్స్ చెయ్యడం విశేషం.

సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో ధర్మా భాయ్ పాత్రలో కనిపించబోతున్నాడు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో త్వరలో ఆన్ లైన్ ద్వారా విడుదల కానున్నాయి. తమన్ అందించిన సాంగ్స్ బాగా వచ్చాయని తెలుస్తోంది. లావణ్య త్రిపాఠి, సీరత్ కపూర్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో సప్తగిరి పాత్ర ప్రేక్షకులను నవ్వించనుంది.