టాక్..”ఆచార్య” నుంచి కూడా మరో ట్రైలర్ ఉందా..?

Published on Apr 13, 2022 7:05 am IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తుండగా మేకర్స్ నిన్ననే మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ని విడుదల చేసారు.

అయితే ఈ ట్రైలర్ యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటు ఉండగా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ లో భాగంగా ఈ సినిమా నుంచి కూడా రెండో ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఫస్ట్ ట్రైలర్ ఫుల్ మాస్ ఎలిమెంట్స్ తో ఉండగా ఈ సారి ట్రైలర్ మాత్రం మంచి ఎమోషనల్ గా ఉంటుందట. ఇది సినిమా రిలీజ్ కి ముందు రావచ్చని టాక్. సో అప్పటి వరకు వేచి ఉండాలి. ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందివ్వగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :