క్రేజీ మాస్ డైరెక్టర్ తో కింగ్ నాగ్ హ్యాట్రిక్ ప్రాజెక్ట్?

క్రేజీ మాస్ డైరెక్టర్ తో కింగ్ నాగ్ హ్యాట్రిక్ ప్రాజెక్ట్?

Published on May 24, 2024 1:58 PM IST


మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో ఆల్ టైం మన్మథుడు అక్కినేని నాగార్జున కూడా ఒకరు. మరి రీసెంట్ గానే ఫ్యామిలీ ఎంటర్టైనర్ “నా సామిరంగ” తో సాలిడ్ హిట్ అందుకున్న తాను నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు. వాటిలో తమిళ హీరో ధనుష్ తో “కుబేర” అనే మల్టీస్టారర్ కూడా చేస్తున్నారు. అయితే ఈ చిత్రం తర్వాత తన నుంచి ఓ సాలిడ్ మాస్ చిత్రం పడబోతున్నట్టుగా లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

దీని ప్రకారం మరోసారి అక్కినేని నాగార్జున అలాగే మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ పడబోతోంది అని వినిపిస్తుంది. మరి వీరి నుంచి వచ్చిన “శివమణి”, “సూపర్” చిత్రాలు టాలీవుడ్ లో మంచి ట్రెండ్ సెట్ చేసాయి. మళ్ళీ ఫైనల్ గా ఇన్నేళ్ల తర్వాత హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఈ క్రేజీ కాంబినేషన్ నుంచి పడబోతోంది అంటూ రూమర్స్ మొదలయ్యాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం పూరీ అయితే “డబుల్ ఇస్మార్ట్” సినిమాతో బిజీగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు