కపిల్‌ దేవ్‌ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నాడట ?

Published on Sep 26, 2018 8:37 am IST

కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ ‘83’ పేరుతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ బయోపిక్ లో ప్రధానంగా 1983 కాలం నాటి భారత్‌ ప్రపంచ కప్‌ తాలూకు సన్నివేశాలను చూపించనున్నారు. కపిల్‌ పాత్రలో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌ నటిస్తుండంతో ఈ చిత్రం పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త తెలిసింది. ఈ సినిమాలో కపిల్ తో పాటుగా మరో కీలక పాత్ర కూడా ఉందట. ఆ పాత్రే క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ పాత్ర. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ పాత్రలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

బన్నీ కూడా ఇంతకు ముందు ఎప్పుడూ బాలీవుడ్ చిత్రాల్లో నటించలేదు. దాంతో ఈ చిత్రంలో బన్నీ నటిస్తున్నాడని వార్తలు రావడంతో అభిమానుల్లో కూడా ఈ చిత్రం పై ఆసక్తి పెరిగింది. మరి బన్నీ ఈ చిత్రంలో నటిస్తే మాత్రం కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ ‘83’కి తెలుగులో కూడా మంచి మార్కెట్ దొరికినట్లే. ఇక బన్నీ ప్రస్తుతం విక్రమ్‌ కె.కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవలే బన్నీ తన తర్వాత సినిమా గురించి స్పందిస్తూ.. స్వయంగా తన నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు ఓపిక పట్టాలని సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.

సంబంధిత సమాచారం :