వకీల్ సాబ్ లో కీలక పాత్రలో ఆ హీరోయిన్?

Published on Jun 30, 2020 7:27 am IST

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. హిందీ హిట్ మూవీ పింక్ రిమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లాయర్ రోల్ చేస్తన్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో నటిస్తున్న క్యాస్టింగ్ గురించి పూర్తి సమాచారం లేదు. కథ ప్రకారం ఈ మూవీలో ముగ్గురు అమ్మాయిల పాత్రలు కీలకం. అందులో ఒక పాత్రలో నివేద థామస్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి కూడా నటిస్తుందా అనిపిస్తుంది. వకీల్ సాబ్ మూవీ నుండి ఓ వర్కింగ్ స్టిల్ లీక్ కాగా, అందులో పవన్ వెనుక స్టాండ్ లో కూర్చోని ఉన్న ఓ అమ్మాయి ఉంది. అస్పష్టంగా ఉన్న ఆమె ముఖం చూస్తుంటే…హీరోయిన్ అంజలి అనిపిస్తుంది. మరి దీనిపై స్పష్టత రావాలంటే కొద్దిరోజులు ఆగాలి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More