యంగ్ డైరెక్టర్ తో క్లీన్ ఫ్యామిలి ఎంటర్టైనర్ లో బాలయ్య.?

Published on Jul 21, 2021 3:59 pm IST

తన కెరీర్ లో మరోసారి నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ సాలిడ్ లైనప్ తో సిద్ధం కానున్నారని నిన్నటితో కన్ఫర్మ్ అయ్యిపోయింది. ప్రస్తుతం తాను నటిస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ “అఖండ” తో బిజీగా ఉన్న బాలయ్య దీని తర్వాత వరుస పెట్టి ఒకదాన్ని మించిన ప్రాజెక్ట్ మరొకటి సిద్ధం అవుతుంది.

అయితే ఈ లైనప్ లోనే ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని వారితో కూడా ఒక ప్రాజెక్ట్ ఉందని కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ పైనే మరింత ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకీ కుడుములు తెరకెక్కించనున్నట్టు టాక్.

లాస్ట్ టైం “భీష్మ”, “ఛలో” చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న ఈ దర్శకుడు ఈసారి బాలయ్యతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేస్తున్నాడని సినీ వర్గాల నుంచి సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే బాలయ్య అఖండ ఫినిష్ చేసే పనిలో ఉండగా అభిమానులు మాత్రం ఫస్ట్ సింగిల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :