ప్రభాస్ దర్శకుడికి చిరు షాక్ ఇస్తాడా?

Published on Jul 15, 2020 11:20 am IST

టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ లూసిఫర్ తెలుగు రీమేక్ దర్శకత్వ బాధ్యతలు వి వి వినాయక్ దక్కించుకున్నారట. మలయాళ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ హక్కులు దక్కించుకున్న చిరంజీవి ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా సాహో ఫేమ్ సుజీత్ ని తీసుకున్నారు. సుజీత్ ఇప్పటికే లూసిఫర్ తెలుగు రీమేక్ స్క్రిప్ట్ పై పనిచేస్తున్నారు. చిరు ఇమేజ్ కి తగ్గట్టుగా స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దుతున్నారు.

కాగా ఈ ప్రాజెక్ట్ దర్శకత్వ బాధ్యతలు వి వి వినాయక్ కి అప్పగించాలని చిరు భావిస్తున్నారట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు రీమేక్ చిత్రాలు ఠాగూర్, ఖైదీ 150 భారీ విజయాలు అందుకున్నాయి. దీనితో లూసిఫర్ రిమేక్ కూడా సుజీత్ కి అప్పగించాలని చిరు ఆలోచన అని ఓ వార్త వినిపిస్తుంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More