తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి సంచలన విజయం సాధించిన చిత్రం ‘హనుమాన్ అంశ్’. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ చిత్రం పై సౌత్ లో కూడా చాలా వార్తలు వినిపించాయి. అందులో ముఖ్యమైనది.. ‘హనుమాన్ అంశ్’ సినిమాని త్రివిక్రమ్ తన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ద్వారా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారనేది ప్రధానమైన వార్త. అయితే అనూహ్యంగా ఆ డీల్ నుంచి త్రివిక్రమ్ తప్పుకోవడంతో, చివరకు ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ తెలుగులో రిలీజ్ చేస్తోంది.
కానీ, ఇక్కడే ఆసక్తికరమైనది ఏమిటంటే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన ‘ఆదర్శ కుటుంబం’ విడుదలవుతున్న అక్టోబర్ 9నే ‘హనుమాన్ అంశ్’ కూడా థియేటర్లలోకి వస్తోంది. అంటే ఒకప్పుడు త్రివిక్రమ్ స్వయంగా తెలుగులోకి తీసుకురావాలనుకున్న సినిమా.. ఇప్పుడు ఆయన సినిమాకే పోటీగా నిలబడుతుంది. అటు ‘హనుమాన్ అంశ్’ పై తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది.
అప్పుడు ‘ఆదర్శ కుటుంబం’పై కొంత ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. కానీ, ‘ఆదర్శ కుటుంబం’కి వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. ‘ఆదర్శ కుటుంబం’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. పైగా థియేటర్ల సంఖ్య, షోలు, మొదటి వారాంతపు ఆక్యుపెన్సీ విషయంలో త్రివిక్రమ్ సినిమాకి తిరుగు ఉండడు. కాబట్టి, ‘హనుమాన్ అంశ్’ రేసులో వెనకే ఉంటుంది.


