‘కామ్రేడ్ కళ్యాణ్’ పరిస్థితి ఏమిటి ?

‘కామ్రేడ్ కళ్యాణ్’ పరిస్థితి ఏమిటి ?

Published on Oct 4, 2026 7:00 AM IST

Comrade Kalyan

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. అయితే అక్టోబర్ 9న ‘ఆదర్శ కుటుంబం’తో పాటు విడుదలవుతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పెద్దగా బజ్ కనిపించడం లేదు. నిజానికి ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై ఓ మోస్తరు బజ్ అయితే క్రియేట్ అయింది. కానీ, ‘ఆదర్శ కుటుంబం’తో క్లాష్ కారణంగా ఈ సినిమాకి థియేటర్లలో భారీ పోటీ, అలాగే ప్రేక్షకుల టాక్ కూడా చాలా కీలకంగా మారే పరిస్థితి ఉంది.

ప్రస్తుతం ఉన్న అప్ డేట్ ప్రకారం ‘కామ్రేడ్ కళ్యాణ్’కు బాగా పాజిటివ్ టాక్ వస్తే తప్పితే.. మరో ఆప్షన్ కనిపించడం లేదు. ఇక 1992 కాలం నాటి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన మాడుగుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ‘కామ్రేడ్ కళ్యాణ్’ అనే నక్సలైట్ నాయకుడి కోసం పోలీసులు, గ్రేహౌండ్స్ దళాలు వేట కొనసాగిస్తుండగా… ఆ సీరియస్ పరిస్థితుల మధ్య శ్రీవిష్ణు తన మార్కు టైమింగ్‌తో పండించిన వినోదం టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది.

జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు

తాజా వార్తలు