టాక్..చరణ్ నెక్స్ట్ కి హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా.?

Published on Feb 10, 2022 7:03 am IST

ఇప్పుడు మన టాలీవుడ్ హీరోస్ లో సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్న వారిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. మరి చరణ్ ఇప్పుడు చేసిన భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” తర్వాత చరణ్ ఒకరిని మించి ఒకరు టాలెంటెడ్ దర్శకులతో సినిమాలు ఒకే చేస్తూ తన లైనప్ పై మరింత ఆసక్తిని నెలకొల్పాడు.

అయితే ప్రస్తుతం ఇండియన్ జేమ్స్ కేమరూన్ శంకర్ తో ఒక భారీ సినిమా చేస్తున్న చరణ్ దీని తర్వాత టాలెంటెడ్ ఫిలిం మేకర్ గౌతమ్ తిన్ననూరితో ఒక భారీ యాక్షన్ ప్రాజెక్ట్ ని చేయనున్న సంగతి తెలిసిందే. మరి దీనికే హీరోయిన్ గా ఎవరు ఫిక్స్ అయ్యారు అనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.

మరి ఈ బజ్ ప్రకారం అయితే నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ఎంపిక అయ్యినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :