ప్రకాష్ రాజ్ పారితోషికం తగ్గించుకున్నాడా ?

ప్రకాష్ రాజ్ పారితోషికం తగ్గించుకున్నాడా ?

Published on Jul 26, 2018 3:30 PM IST

prakash raj
తెలుగు లో అనేక చిత్రాల్లో నటించి విలక్షణ నటుడు పేరు తెచుకున్నాడు నటుడు ప్రకాష్ రాజ్. దాదాపు దశాబ్ద కాలంగా హావ సాగించిన ఆయన ఇటీవల కాస్త నెమ్మదించారు. గత కొంత కాలంగా రాజకీయాల మీద ద్రుష్టి మరల్చిన ఆయన ఇక సినిమాలకు దూరమవుతారేమో అనుకున్నారు. కాని మళ్లీ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు.

దాంట్లో భాగంగా ఇటీవల ‘శ్రీనివాస కళ్యాణం’ అనే చిత్రంలో ముఖ్య పాత్రలో నటించారు. నితిన్, రాశి ఖన్నా జంటగా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈచిత్రం. ఇక ఈ సినిమాలో నటించినందుకు ప్రకాష్ రాజ్ రోజుకి 3 లక్షల రూపాయలను మాత్రమే తీసుకున్నారట. మాములు గా ఆయన రోజుకి 5 లక్షలు ఛార్జ్ చేస్తారు. కాని దిల్ రాజు తో మంచి అనుబంధం ఉండడంతో ఈ చిత్రానికి అయన తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్లు చెబుతున్నారు. ఇక ప్రకాష్ రాజ్ దాదాపు గా దిల్ రాజు నిర్మించిన అన్ని చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు