ప్రస్తుతం టాలీవుడ్ సహా అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సినిమానే “లెనిన్”. అక్కినేని అఖిల్ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సాలిడ్ మాస్ డ్రామా రీసెంట్ గా ట్రైలర్ తో ఆడియెన్స్ ని మెప్పించి మరింత బజ్ అందుకుంది. ఇలా విడుదలకి రాబోతున్న ఈ సినిమా విషయంలో క్రేజీ బజ్ ఇపుడు వినిపిస్తుంది.
థియేట్రికల్ విడుదలకి ముందు మేకర్స్ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ చేయనుండగా ఈ ఈవెంట్ కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అతిగా రావడం దాదాపు ఖాయం అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమా నిర్మాత నాగవంశీ నుంచి రీసెంట్ గానే ఎన్టీఆర్ తో భారీ సినిమా గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సో ఎన్టీఆర్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా జూలై 10న సినిమా గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది.


