“కేజీయఫ్” స్టార్ యష్ ఫేస్ బుక్ హ్యాక్ అయ్యిందా.?

Published on May 8, 2021 9:09 am IST

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటైన “కేజీయఫ్ చాప్టర్ 1” తో ఈ సినిమాలో ప్రతీ ఒక్కరికీ అపారమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా హీరో యష్ కి కూడా అన్ని వర్గాల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఇప్పుడు చాప్టర్ 2 లో కూడా తన ప్రెజెన్స్ కోసం పెద్ద ఎత్తున అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా కన్నడ నుంచి అయితే ఏ స్టార్ హీరోకు లేని ఫాలోయింగ్ యష్ కు సోషల్ మీడియాలో ఉంది.

కానీ లేటెస్ట్ గా యష్ పేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యినట్టుగా కొన్ని వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. కానీ అసలు విషయంలోకి వెళితే యష్ అకౌంట్ ఏమీ హ్యాక్ అవ్వలేదని కొన్ని టెక్నికల్ ప్రాబ్లెమ్స్ వల్ల సమస్య తలెత్తింది అని తెలుస్తుంది. దీనితో యష్ పేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యినట్టుగా రూమర్స్ వ్యాప్తి చేస్తున్న వారు మానుకోవాలి అని ఇతర అభిమానులు సూచిస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మోస్ట్ అవైటెడ్ చాప్టర్ 2 విడుదలకు రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం :