పవన్ లైనప్ పై లాజిక్ మిస్సయ్యిందా..?

Published on Jul 13, 2021 7:06 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తన కెరీర్ లో ఎప్పుడు లేని వరుస ప్రాజెక్ట్ లని ప్లాన్ చేసుకొని ఆశ్చర్యపరిచారు. అలా ఇప్పటికి పవన్ “వకీల్ సాబ్” చిత్రం వరకు చేశారు. అయితే పవన్ లైనప్ లో ఉన్న సినిమాలను గమనిస్తే కాస్త కన్ఫ్యూజన్ అనిపించే లాజిక్ మనకి కనిపిస్తుంది. పవన్ హీరోగా నటించిన సినిమాలే కాకుండా గెస్ట్ రోల్ లో కనిపించిన సినిమాలతో పాటుగా “అజ్ఞ్యాతవాసి” తో 25 సినిమాలు అయ్యాయి అన్న సంగతి తెలిసిందే.

అలాగే అదే సినిమా పవన్ కెరీర్ బెంచ్ మార్క్ గా చూపించి ఓ రేంజ్ లో హైప్ తెచ్చారు. కానీ అనూహ్యం ఆ చిత్రం ఘోర పరాజయం పాలయ్యింది. దీనితో వకీల్ సాబ్ పవన్ 26 వ సినిమా, క్రిష్ తో ప్లాన్ చేసిన భారీ పాన్ ఇండియన్ సినిమా “హరిహర వీరమల్లు” సినిమా టైటిల్ రివీల్ కాకముందు వరకు పవన్ 27వ సినిమాగా చలామణి అయ్యాయి.

ఇక ఇక్కడ నుంచే అసలైన లాజిక్ కనిపిస్తుంది. వీటి తర్వాత పవన్ నుంచి రెండు సినిమాలు అనౌన్స్ అయ్యాయి. ఒకటి తన బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ తో ఒక సినిమా, సాగర్ చంద్ర దర్శకత్వంలో “అయ్యప్పణం కోషియం” రీమేక్ లు ఉన్నాయి. మరి వీటిలో హరీష్ సినిమా పవన్ 28వ సినిమాగా ప్రకటించబడింది.

కానీ ఈ మూడు సినిమాల్లో అనౌన్స్మెంట్స్ తో సంబంధం లేకుండా అయితే పవన్ నుంచి నెక్స్ట్ అయ్యప్పణం రీమేక్ నే ముందుగా విడుదల అయ్యేలా ఉంది. సో ఆ లాజిక్ ప్రకారం పవన్ 27వ సినిమా లిస్ట్ లోకి ఇదే వస్తుంది. ఆ తర్వాత వీరమల్లు 28, హరీష్ ప్రాజెక్ట్ 29 గా ఉంటాయి..కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది కదా కానీ రిలీజ్ ప్రకారం చూస్తే లైనప్ ఇలానే ఉంది మరి. ఏమైనా ఈ కాలంతో కూడా అంకెల గారడీ భలే మారిపోతుంది..

సంబంధిత సమాచారం :