టాక్..మరో సెన్సేషనల్ కాంబో సెట్ చేస్తున్న మహేష్..?

Published on Mar 25, 2022 7:04 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ పెట్ల తో “సర్కారు వారి పాట” అనే సాలిడ్ మాస్ అండ్ స్టైలిష్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పలు భాషల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తుండగా దీని తర్వాత మరిన్ని క్రేజీ కాంబోస్ ని మహేష్ సెట్ చేసుకుంటూ ఇంటర్నేషనల్ సినిమా వైపు తన ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు.

మరి వీటిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ భారీ సినిమా అలాగే టాలీవుడ్ ప్రైడ్ దర్శకుడు రాజమౌళితో ఓ భారీ సినిమా ఓకే చేసి సెన్సేషన్ ని నమోదు చేసాడు. మరి ఇప్పుడు ఇంకో క్రేజీ బజ్ మహేష్ లైనప్ పై వినిపిస్తుంది. దీని ప్రకారం అయితే మహేష్ మరో సెన్సేషనల్ మాస్ కాంబో సెట్ చేస్తునట్టు తెలుస్తుంది. టాలీవుడ్ కి చెందిన ఒక నోటెడ్ మాస్ దర్శకుడితో అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా చేయనున్నట్టు సినీ వర్గాల్లో టాక్. మరి వేచి చూడాలి మహేష్ ఏ కాంబోతో వస్తాడో అనేది.

సంబంధిత సమాచారం :