మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం అందరికీ తెలిసిందే. మంచి బజ్ ఉన్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తుండగా ఈ సినిమా రన్ టైం కోసం లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. దీని ప్రకారం ఈ సినిమాకి మొత్తం 2 గంటల 38 నిమిషాల నిడివిని మేకర్స్ లాక్ చేసినట్టు వినిపిస్తుంది.
దీనితో కొంచెం పెద్ద రన్ టైం తోనే రాబోతుంది అని చెప్పాలి. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ సినిమాలో వెంకీ మామ కూడా కీలక పాత్రలో నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 12న గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కాబోతుంది.


