ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు ఓ భారీ చిత్రాన్ని దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా హైయెస్ట్ బడ్జెట్ తో అంతర్జాతీయ విలువలతో తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా విషయమై రీసెంట్ గా కొన్ని రూమర్స్ బయటకి వచ్చాయి.
దీని ప్రకారం అట్లీ ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడని వచ్చే ఏడాది లేదా 2027 లో ఒక సినిమా ఆ తర్వాత మరో సినిమా రిలీజ్ చేస్తారు అంటూ పలు రూమర్స్ వచ్చాయి. అయితే ఈ రూమర్ పై క్లారిటీ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ కాంబినేషన్ లో సీక్వెల్ లాంటి పార్ట్ లు లేవట. కేవలం ఒక్క సినిమా గానే ఇది వస్తున్నట్టు వినిపిస్తుంది. సో ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాలో దీపికా పదుకోణ్ హీరోయిన్ గా నటిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


