“ఎన్టీఆర్ 30” మేకోవర్ ని మేకర్స్ ఎప్పుడో రివీల్ చేసారా.!

“ఎన్టీఆర్ 30” మేకోవర్ ని మేకర్స్ ఎప్పుడో రివీల్ చేసారా.!

Published on Nov 17, 2022 7:04 AM IST

మన టాలీవుడ్ హీరోస్ లో చాలా మంది హీరోలు తమ మేకోవర్ సినిమాల్లో మర్చి ఉండొచ్చు కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రిపేర్ చేసిన మేకోవర్ అనేది చాలా స్పెషల్ అని చెప్పి తీరాలి. తన కెరీర్ ఆరంభంలో ఉన్న లుక్స్ కి ఇప్పుడు తాను తనని ఆవిష్కారించుకున్న లుక్ కి ఎంత డిఫరెన్స్ ఉందో అందరికీ తెలిసిందే. మరి అలా ఇప్పుడు ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూ వస్తున్న తారక్ లేటెస్ట్ గా ప్రిపేర్ చేసిన కొత్త లుక్ తో మళ్ళీ “బాద్షా” వైబ్స్ తీసుకొచ్చి షాకిచ్చాడు.

అయితే చాలా మంది ఎన్టీఆర్ 30 కి ప్రిపేర్ చేసిన లుక్ ఇది అంటూ పలు రూమర్స్ వచ్చాయి కానీ ఇది అది కాదు అని కన్ఫర్మ్ అయ్యింది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు వైరల్ అవుతున్న లుక్ కన్నా ముందే కొరటాల శివ సినిమాకి ఎన్టీఆర్ ప్రిపేర్ చేసిన లుక్ బయటకి వచ్చింది.

ఎన్టీఆర్ RRR షూట్ కంప్లీట్ చేసాక “ఎవరు మీలో కోటీశ్వరులు” మధ్యలో అయితే ఎన్టీఆర్ అప్పట్లోనే కొత్త లుక్ కి మారాడు. మరి అప్పుడు అయితే తాను జనతా గ్యారేజ్ లుక్ ని మార్చాడు. దీనితో అది మళ్ళీ చాలా ఫ్రెష్ గా అనిపించగా అది అయితే తన 30వ సినిమా కోసమే అని ప్రచారం కూడా జరిగింది. దీనితో అయితే అప్పట్లోనే ఎన్టీఆర్ 30 లుక్ అనేది రివీల్ అయ్యిందని చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు