టాక్..పవన్ “వీరమల్లు” కోసం సిద్ధం అవ్వబోతున్నాడా.?

Published on Jun 22, 2022 11:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరోగా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ఓ భారీ చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ చిత్రమే భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు”. పవర్ స్టార్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అలాగే హైయెస్ట్ బడ్జెట్ సినిమా అందులోని పవన్ ఇది వరకు చేయని పీరియాడిక్ సబ్జెక్టు కావడంతో పవన్ అభిమానుల్లో ప్రతిష్టాత్మక అంచనాలు ఉన్నాయి.

అయితే గత కొన్నాళ్ల వరకు పవన్ రాజకీయాలు మరియు సినిమాలను ఒకేలా బ్యాలన్స్ చేస్తూ షూటింగ్స్ చేస్తున్నందున బాగానే ఉండేది. కానీ ఇపుడు రాజకీయాల్లో ఎక్కువ యాక్టీవ్ గా ఉంటుండడంతో ఈ చిత్రం సహా ఇతర చిత్రాల టీం వారిలో కాస్త ఆందోళన ఉంది.

అయితే ముందు ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న వీరమల్లు చిత్రాన్ని పవన్ కంప్లీట్ చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. తన బస్సు యాత్రకి ముందే వీలు చూసుకొని కొన్ని రోజులు ఒక్క ఈ చిత్రానికి కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అయితే మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :