“సలార్” లో ప్రభాస్ రోల్ ఇలా కన్ఫర్మా.?

Published on May 7, 2021 12:00 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నటిస్తున్న పలు సాలిడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ లో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. ఇప్పటికే కొంత మేర షూట్ కంప్లీట్ చేసుకున్న ఈ కాంబోపై ఎనలేని అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ చేస్తున్న రోల్ కు సంబంధించి అప్పట్లోనే పలు ఇంట్రెస్టింగ్ గాసిప్స్ బయటకు వచ్చాయి.

ప్రభాస్ ఈ చిత్రంలో ఒకటి కాకుండా రెండు రోల్స్ లో కనిపిస్తాడని టాక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీనిపైనే లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. ప్రభాస్ ఈ చిత్రంలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడని తెలిసింది. మరి ఈ షేడ్స్ లో అని కాకుండా ప్రభాస్ డ్యూయల్ రోల్ లోనే నటిస్తున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు కానీ ఈ టాక్ మరింత బలపడుతుంది. మరి వేచి చూడాలి ప్రభాస్ రోల్ అలానే ఉంటుందా లేదా అని.

సంబంధిత సమాచారం :