“రాధే శ్యామ్” సర్ప్రైజ్ ఇదే అయ్యుంటుందా.?

Published on Oct 21, 2020 10:00 am IST

ఒక్కసారిగా ప్రభాస్ అభిమానులు ఇపుడు ఉక్కిరిబిక్కిరి అయ్యిపోతున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్” యూనిట్ నుంచి వరుస అప్డేట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. అయితే లేటెస్ట్ గా సంగీత దర్శకుడు ఎవరో అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ నుంచి మరో ఊహించని సర్ప్రైజ్ ఉందని పూజా ప్రకటించడంతో అది ఏమిటా అని ప్రభాస్ అభిమానులకు నరాలు తెగిపోతున్నాయి.

అయితే ఇప్పటికే ఈ అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నామని ప్రకటించేసారు. ఇక దానికి మించిన సర్ప్రైజ్ ఏదన్నా ఉంది అంటే అది టీజర్ అనే చెప్పాలి. ఇంతలా ఊరించి సర్ప్రైజ్ పేరిట ఏదన్నా పోస్టర్ ను మాత్రమే విడుదల చేస్తే డార్లింగ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా నిరాశ పడొచ్చు. ఈ 23 ఎలాగో ప్రభాస్ పుట్టినరోజు కానుకగా మోషన్ పోస్టర్ ఓకే కానీ దసరా కానుకగా టీజర్ వస్తే? అంతకు మించిన సర్ప్రైజ్ ఇంకేముంటుంది. మరి దానినే ఈ ఉదయం 11 గంటల 31 నిమిషాలకు అనౌన్స్ చేస్తారా లేక మరేమన్నా రివీల్ చేస్తారా అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :

More