ఆర్ఆర్ఆర్ టీమ్ అంతా కలిపి ఒకేసారి ఇస్తారట

Published on Oct 9, 2019 1:12 pm IST

జక్కన్న స్టార్ హీరోలైన ఎన్టీఆర్,చరణ్ లను తీసుకొని ఆర్ ఆర్ ఆర్ అనే అద్భుతాన్ని చక్కగా చెక్కుతున్నాడు. ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్న ఈ మూవీ షూటింగ్ పలు ప్రాంతాలలో జరుపుకుంటుంది. షెడ్యూల్ విరామం రావడంతో చరణ్ సైరా ప్రొమోషన్స్ పాల్గొంటుండగా, ఎన్టీఆర్ ప్రకటనల చిత్రీకరణలో పాల్గొనడమే కాకుండా కుటుంబంతో గడుపుతున్నారని సమాచారం. ఐతే ఈ మూవీ పై ఇటీవల టైటిల్ ఇదే నంటూ ఓ పుకారు అనేక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఐతే అందులో నిజం ఎంతనేది జక్కన్న చెప్పేవరకు ఎవరికీ తెలిసే ఆస్కారం లేదు.

ఐతే దసరా కానుకగా ఆర్ ఆర్ ఆర్ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. టైటిల్, లుక్స్ లాంటివి రివీల్ చేయకపోయినా కనీసం దసరా స్పెషల్ పోస్టర్ లాంటిది విడుదల చేశే అవకాశం ఉంటుందని అందరూ భావించారు, కానీ అలా జరగలేదు. మరి ఇంతలా అభిమానులను ఎదురు చూసేలా చేస్తున్న జక్కన్న అందరి నిరీక్షణకు తెరదించేలా ఒకే సారి పెద్ద సర్పైజ్ ప్లాన్ చేస్తున్నారట. అటు మెగా అభిమానులు, ఇటు ఎన్టీఆర్ అభిమానులు సంబరపడేలా త్వరలోనే ఆర్ ఆర్ ఆర్ పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చే అవకాశం కలదు. అభిమానుల నిరీక్షణకు క్యాష్ చేసుకోవడంలో దిట్టైన రాజమౌళి, ఆ ఒక్క అప్డేట్ తో కావలసినంత ప్రచారం ప్రోగుచేసుకోవడం ఖాయం.

సంబంధిత సమాచారం :

X
More