రామ్ రెడ్ మూవీతో ప్రయోగం చేయనున్నాడా…?

Published on Nov 9, 2019 11:34 am IST

రామ్ ఈ ఏడాది ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 75కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి అబ్బురపరిచింది. ఈ మూవీ తరువాత మూడు నెలలకు పైగా గ్యాప్ తీసుకున్న రామ్ ఇటీవల రెడ్ అనే చిత్రాన్ని ప్రకటించారు. అంతే కాకుండా మాస్ అప్పీరెన్స్ తో ఇంటెన్స్ లుక్ లో ఉన్న రామ్ ఫోటో ఫ్యాన్స్ కి కిక్కు ఇచ్చేదిలా ఉంది. స్రవంతి రవి కిషోర్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు.

ఐతే తమిళ హిట్ మూవీ ‘తాడం’ కి తెలుగు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతోందని సమాచారం. అరుణ్ విజయ్ డ్యూయల్ రోల్ లో క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీనే కిషోర్ తిరుమల రామ్ తో చేస్తున్నారట. ఐతే ఈ మూవీలో కమర్షియల్ అంశాలు అంతగా ఉండవు. హీరోయిన్ ఉన్నప్పటికీ ఆమె పాత్ర కేవలం కొన్ని సన్నివేశాలకే పరిమితం. ముఖ్యంగా ఈ మూవీ ఓ క్రైమ్ విషయంలో ఇరుకున్న ట్విన్స్ మధ్య నడుస్తుంది. హీరోయిన్ , పాటలకు అంతగా ప్రాధాన్యం లేని తాడం చిత్రం కనుక ఇదైతే, రామ్ ప్రయోగం చేస్తున్నట్లే లెక్క. ఇక రెడ్ మూవీకి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More