“సలార్” టీజర్ కి రన్ టైం లాక్డ్.?

Published on Jun 4, 2023 8:09 pm IST


ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హవా నడుస్తుంది. తాను నటించిన లేటెస్ట్ సినిమా “ఆదిపురుష్” కోసమే ఇండియన్ సినిమా ఇప్పుడు ప్రతి రోజు హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటూ ఉండగా ఈ భారీ చిత్రం తర్వాత మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ చిత్రం “సలార్” కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ “సలార్ ది సాగా” నుంచి మెయిన్ గా టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తుండగా ఈ టీజర్ అయితే ఆదిపురుష్ తో ఆల్ మోస్ట్ ఫిక్స్ అని టాక్ ఉంది. ఇక ఈ టీజర్ పై అయితే మరో సాలిడ్ బజ్ ఇప్పుడు తెలుస్తుంది.

ఈ క్రేజీ టీజర్ అయితే సుమారు 90 సెకండ్స్ పాటు ఉంటుందని తెలుస్తుంది. అయితే ఇది వరకే ప్లాన్ చేసిన టీజర్ ని రిలీజ్ చేస్తారా లేక కొత్త టీజర్ ని ఏమన్నా ప్లాన్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఆదిపురుష్, సలార్ రెండు ట్రీట్స్ కోసం కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :