అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఇంకా ఎవరితో ఫిక్స్ కాలేదా?

Published on Aug 12, 2019 7:06 am IST

ఒక మూవీతో రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండ హీరోగా అర్జున్ రెడ్డి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈయన అదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా షాహిద్ కపూర్ తో తీసి, డబుల్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కాగా తాజాగా పత్రికా ప్రతినిధులతో ముచ్చటించిన ఈయన ఈ రెండు చిత్రాలతో పాటు, తన భవిష్యత్ చిత్రాల గురించి చెప్పారు.

ప్రస్తుతం కబీర్ సింగ్ విజయాన్ని ఆస్వాదిస్తునాను అన్న ఆయన ఇంకా మంచి కథలు వెతికే పనిలో ఉన్నాను అని చెప్పారు. దీనితో ఈ దర్శకుడు ఇంకా ఏ హీరోతో చిత్రానికి సిద్ధం కాలేదని తెలుస్తుంది. ఈ మధ్య ఆయన పై, మహేష్ అని, విజయ్ దేవరకొండ తో సినిమా చేయనున్నారంటూ విభిన్న పుకార్లు వచ్చాయి. బయో పిక్స్ లాంటివి ఏమైనా తీసే ఆలోచన వుందా అన్న ప్రశ్నకు, ఆసక్తి ఉంది కానీ, వాటిపై ఎక్కువ కృషి చేయాల్సివుంటుంది అన్నారు.

సంబంధిత సమాచారం :