“సర్కారు వారి పాట” ప్లాన్ మారిందా?

Published on Dec 3, 2020 10:09 am IST

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం “సర్కారు వారి పాట”. వరుస హిట్ చిత్రాల దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పైగా మహేష్ దీనికి ముందు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడంతో దీనిపై ఆ అంచనాలు కూడా పీక్స్ లో ఉన్నాయి.

అయితే లాక్ డౌన్ వల్ల షూట్ ఈ చిత్రానికి చాలా దూరం అయ్యింది. అయితే ఎలాగో ప్లానులు మార్చి ఫైనల్ గా షూట్ ను యూఎస్ లో సిద్ధం చేశారు. కానీ మళ్ళీ మేకర్స్ ప్లాన్ మార్చినట్టు తెలుస్తుంది. ముందు యూఎస్ లో అనుకున్న షూట్ ను అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఆ షూట్ ను అందాకా వాయిదా వేసినట్టు తెలుస్తుంది.

దీనితో మేకర్స్ మొదట హైదరాబాద్ లోని ఒక భారీ సెట్ లో ఈ జనవరి నుంచి మొదలు పెట్టి నిర్విరామంగా ఒక నెల రోజుల పాటు షూట్ చేయనున్నారట. ఆ తర్వాత మార్చ్ నెలలో యూఎస్ షెడ్యూల్ ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ అలాగే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారితో మహేష్ కలిసి సంయక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More