షాహిద్ కి జెర్సీ వర్కౌట్ అవుతుందా ?

Published on Jul 5, 2020 10:25 pm IST

నేచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ హిందీ రీమేక్ లో స్టార్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. షాహిద్ కి హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్‌ కనిపించనుంది. షాహిద్ కపూర్ ‘అర్జున్ రెడ్డి’తో భారీ హిట్ అందుకొన్నారు. ఇప్పుడు కూడా అదే రీమేక్ ఫార్ములాను ఫాలో అవుతూ చేస్తున్న ఈ సినిమా మీద హిందీ ప్రేక్షకుల్లో కూడా అమితాశక్తి నెలకొని ఉంది. కానీ అర్జున్ రెడ్డి బోల్డ్ మూవీ, జెర్సీ దానికి అపోజిట్. మరి అర్జున్ రెడ్డిలా జెర్సీ వర్కౌట్ అవుతుందా ? ఈ సారి షాహిద్ కి ఈ రీమేక్ ప్లాన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తోందో చూడాలి.

ఇక తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ నిర్మాణంలో తెరకెక్కుతుంది. నవంబర్ 28వ తేదీన చిత్రం విడుదలకానుంది. అయితే తెలుగు జెర్సీలో కొన్ని మార్పులు చేసి హిందీలోకి తెరకెక్కిస్తున్నారు. మెయిన్ గా హీరో కొడుకు పాత్రను కొత్తగా రాసినట్లు తెలుస్తోంది. తండ్రి పాత్ర మధ్యలో ఆపేసిన క్రికెట్ జర్నీని, కొడుకు పాత్ర కంటిన్యూ చేస్తోందట.

సంబంధిత సమాచారం :

More