సాంగ్ తో స్టార్ట్ చేయనున్న ‘శర్వానంద్’ ?

సాంగ్ తో స్టార్ట్ చేయనున్న ‘శర్వానంద్’ ?

Published on Dec 21, 2025 8:00 AM IST

Sharwanand

దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. ఐతే, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? అంటూ శర్వా ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. కాగా తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం జనవరి నాలుగో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుందట. మొదటి షెడ్యూల్ లో శర్వా పై ఓ సాంగ్ కి సంబంధించిన కొన్ని మాంటేజ్ షాట్స్ ను తీస్తారట. అన్నట్టు ఈ సినిమాలో ‘మ్యాడ్‌’, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్‌ కుమార్‌ హీరోయిన్‌ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

కాగా గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట. ఈ క్రమంలోనే శర్వాకి కథ చెప్పాడు. కాగా తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్ లో జరిగే డ్రామా చాలా బాగుంటుందట. ఈ ఏడాది చివర్లో వీరిద్దరి కలయికలో సినిమా మొదలు అవుతుందట. ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు