రామ్ చరణ్ తో సినిమా నిజమేనా ?

రామ్ చరణ్ తో సినిమా నిజమేనా ?

Published on Jan 5, 2026 11:01 AM IST

Ram Charan

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Varaprasad Garu) సినిమా సంక్రాంతికి స్పెషల్ గా రాబోతుంది. ఐతే, ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి చేయబోయే సినిమా పై ఇప్పుడు ఓ వార్త వైరల్ అవుతుంది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్, రామ్ చరణ్ కి చాలా బాగా నచ్చిందట. ఈ విషయాన్ని అనిల్ రావిపూడినే బయటపెట్టాడు. చరణ్ చాలా ఎక్స్‌టార్డినరీగా ఉందని చెప్పాడట. మొత్తానికి అనిల్ రావిపూడి వర్క్ చరణ్ కి నచ్చింది.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ (Ram Charan) తో సినిమా చేయాలని, పైగా పాన్ ఇండియా లెవెల్లో సినిమా చేయాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తన నుంచి రాబోయే రోజుల్లో కచ్చితంగా పెద్ద స్పాన్ ఉన్న పాన్ ఇండియా సినిమా వస్తుందని చెప్పుకొచ్చాడు. దీనిబట్టి, అనీల్ రావిపూడి దర్శకత్వంలో చరణ్ సినిమా వచ్చే అవకాశం ఉంది. ఐతే, “మన శంకర వరప్రసాద్ గారు” విజయాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు