ఆర్ ఆర్ ఆర్ తరువాత రాజమౌళి ప్రాజెక్ట్ అదేనా…!

Published on Aug 27, 2019 10:11 am IST

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. త్వరలో ఈ చిత్ర షూటింగ్ బల్గెరియాలో జరగనుందని సమాచారం. ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు అక్కడ చిత్రీకరయించనున్నారని తెలుస్తుంది. కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు వంటి ఇద్దరు ఉద్యమ వీరుల కథకు కాల్పనికత జోడించి రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డి వి వి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది జులై 30న విడుదల అవుతుంది. ఐతే ఈ చిత్రం తరువాత రాజమౌళి బాహుబలి 3ని తీయనున్నారా…? ప్రభాస్ చేస్తున్న తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఆ అనుమానం కలుగక మానదు. సాహో ప్రొమోషన్స్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్న ప్రభాస్ ని ఈ విషయం పై అడుగుతుండగా ఆయన ఖండించక పోగా, ఉంటే ఉండవచ్చు అని సమాధానం చెవుతున్నారు. బాహుబలి కథ రెండు చిత్రాలతో సగమే చెప్పగలిగాం అని ఆయన అనడంతో బాహుబలి 3ఉండే అవకాశం ఉందనిపిస్తుంది. దీనితో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తరువాత బాహుబలి స్క్రిప్ట్ పనులుమొదలుపెట్టినా ఆశ్చర్యం లేదు. ఇదే కనుక జరిగితే మరో బాక్సాఫీస్ సంచలనానికి తెరలేపినట్లే అవుతుంది.

సంబంధిత సమాచారం :