సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు రాహుల్ తెరకెక్కించిన భారీ హిస్టారికల్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి మేకర్స్ లేటెస్ట్ గా సాలిడ్ ట్రైలర్ కట్ ని అయితే విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ తో పాటుగా ముందు వచ్చిన టీజర్ లో ఓ పాత్ర అందరి దృష్టి ఆకర్షించింది.
శింగనమల కొండ మీద గుహలో ఓ భారీ మనిషి ఉన్నట్టు చూపించడం ఒకింత ఆసక్తి పెంచింది. అయితే మొదట అంతా ఆ రోల్ కూడా విజయ్ నే చేస్తున్నాడని భావించారు కానీ ఇప్పుడు ట్రైలర్ లో క్లియర్ గా అది విజయ్ కాదని క్లారిటీ వచ్చేసింది. కానీ దర్శకుడు ఆ పాత్ర చేసింది ఓ ప్రముఖ నటుడు అని వీలయితే అది మీరే కనిపెట్టాలని ఆడియెన్స్ కి వదిలేసారు.
అయితే ఆ నటుడు మరెవరో కాదు పందెం కోడి, సాహో రీసెంట్ గా ఓజి లో కూడా కనిపించిన నటుడు లాల్ లానే కనిపిస్తున్నారు. ప్రొస్థెటిక్ మేకప్ వేసినప్పటికీ భద్రమల్లన్నగా అతనే చేసినట్టుగా అనిపిస్తుంది. సో ఈ అంచనా ఎంతవరకు నిజం అనేది ఈ 16తో తేలిపోతుంది.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


