రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఏ రేటెడ్ రోమ్ కామ్ సినిమానే ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్. తన ఓటీటీ హిట్ 90స్ బయోపిక్ కి కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో మాత్రం సిరీస్ రేంజ్ లో హిట్ కాలేకపోయింది.
ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రాన్ని నేటి నుంచి పాన్ ఇండియా భాషల్లో దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. సో ఈ రోమ్ కామ్ ని చూడాలి అనుకుంటే చూడొచ్చు. ఇక ఈ సినిమాలో శివాజీ, వాసుకి తదితరులు కీలక పాత్రల్లో నటించగా సూర్య దేవర నాగవంశీ మరియు సాయి సౌజన్యలు నిర్మాణం వహించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


