మ్యూజికల్ ట్రీట్‌ను రెడీ చేస్తున్న శర్వా.. భోగి ఫస్ట్ సింగిల్‌కు టైమ్ ఫిక్స్..!

మ్యూజికల్ ట్రీట్‌ను రెడీ చేస్తున్న శర్వా.. భోగి ఫస్ట్ సింగిల్‌కు టైమ్ ఫిక్స్..!

Published on Oct 8, 2026 11:00 PM IST

యంగ్ హీరో శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కలయికలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘భోగి’. శర్వా-సంపత్ బ్లడ్ ఫెస్ట్ అనే క్యాప్షన్‌తో వస్తున్న ఈ సినిమా నుంచి చిత్రబృందం మ్యూజికల్ ఫెస్టివల్‌ను ప్రారంభించింది.

ఈ ప్రాజెక్ట్ నుంచి మొదటి సింగిల్ ‘ఎగిలివరంగా’ సాంగ్‌ను రేపు(అక్టోబర్ 9) మధ్యాహ్నం 2:25 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఫోక్ గీతానికి ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు. శర్వానంద్ కెరీర్‌లో 38వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మరియు డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్, నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ సినిమా నుంచి రాబోతున్న ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు